రూ.10 కోట్ల మోసం.. పోలీస్ స్టేషన్ కు నటుడు నరేష్!

Sun Apr 18 2021 14:26:20 GMT+0530 (IST)

Rs 10 crore fraud .. Actor Naresh to police station!

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసి.. సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నారు సీనియర్ నరేష్. బలమైన సపోర్టింగ్ క్యారెక్టర్లలో నటిస్తూ.. సినిమాల విజయాల్లో కీ రోల్ పోషిస్తున్నారు. తన కోసం రచయితలు ప్రత్యేక పాత్రలు సృష్టిస్తున్నారని చాలా ఆనందంగా ఉందని చెబుతూ వస్తున్న నరేష్.. ఉన్నట్టుండి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం కలకలం రేపింది.నటనతోపాటు బిజినెస్ ను కూడా పారలాల్ గా రన్ చేస్తున్న ఆయన.. తాజాగా పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఓ కంపెనీ తనను దాదాపు రూ.10 కోట్లకు మోసం చేసిందని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఆదివారం ఉదయం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది.

లింగం శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన కీస్టోన్ ఇన్ ఫ్రా కంపెనీ రన్ చేస్తున్నాడని తమ కుటుంబంతో ఉన్న పరిచయం నేపత్యంలో ఏడున్నర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వలేదని పిటీషన్లో పేర్కొన్నట్టు సమాచారం. మొత్తం రూ.10 కోట్లకుపై తనను మోసం చేశాడని డబ్బులు అడిగితే తప్పించుకొని తిరుగుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలిసింది.

నరేష్ ఫిర్యాదను రిజిస్టర్ చేసిన పోలీసులు.. చీటింగ్ కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.