ఫోటోస్టోరీ: వాటర్ థెరపీలో రెచ్చిపోతున్న హీరోయిన్

Sun Jul 03 2022 12:01:51 GMT+0530 (IST)

Rragini Dwivedi Latest Photo

సుందరమైన స్విమ్మింగ్ పూల్..అందులో అందమైన బ్యూటీ. ఆ రెండు మిక్సీ అయితే ఇంకేముంది? అక్కడేదో జరుగుతుందని సందేహం రాక  మానదుగా. అవును ఆ రెండింటీని చూస్తే అదే అనిపిస్తుంది. స్విమ్ షూట్ లో రాగిణి ద్వివేది పూల్ లో స్నానానికి దిగడానికి ముందు ఇలా పూల్ పుట్ పాత్ పై పలుచని నీళ్లలో  జలకాలుడూ కనిపిస్తుంది.సన్ గ్లాసెస్ ధరించి హెయిర్ మొత్తం దగ్గరకి సవరించి రబ్బర్ బ్యాండ్  బిగించి బంతాడేసే అందంతో యువతని ఆకట్టుకుంటుంది. స్విమ్మింగ్ పూల్ నేలపై బొమ్మర్లా పడుకుని  రెండు  కాళ్లు పైకెత్తి  వాటర్ థెరపీ ఆస్వాదనకి గురైంది. మండే ఎండలోచల్లని పూల్ లో పడుకుంటే? ఎంత హాయిగా ఉంటుందో? అదే అనుభూతిని ఆస్వాదిస్తోంది.

ఫోటోలో అమ్మడి తడిపొడి అందాలు అంతే హైలైట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో  అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇక అభిమానుల కామెంట్లు అయితే హైలైట్  అని చెప్పాలి.  వాటర్ కి అమ్మ డు అందాలతో థెరపీ చేస్తుందా?  లేక వాటర్ థెరపీకి అమె గురైందా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గార్జియస్..బ్యూటీఫుల్.. సో హాట్ అంటూ పొగిడేస్తున్న అభిమానులు మరికొంత మంది.

వివిధ రకాల భాషల్లో నెటి జనులు కామెంట్లు పోస్ట్ చేసి అభిమానం చాటుకుంటున్నారు. రాగిణి సోషల్  మీడియాలో మరీ అంత యాక్టివ్ కాదు. అవసరం మేర అభిమానులకు టచ్ లోకి వస్తుంది. అందుకు కొంత స్పేస్ కేటాయించుంటుంది. ఇష్టాను సారం సోషల్ మీడియాని వినియోగించే భామలకు రాగిణి దూరం . ఎంతో పద్దతిగానే సామాజిక మాధ్యామాల్ని వినియోగిస్తుంటుంది. ఈ అమ్మడు కన్నడలో ఎక్కువ సినిమాలు చేసింది.

మలయాళం..తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసింది. టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన `జెండాపైకపిరాజు`లో నటించింది. ఆ సినిమా ఫెయిలవ్వడంతో టాలీవుడ్ లో పెద్దగా ఫేమస్ కాలేదు.  ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ప్రస్తుతం `గాంధీగిరి`...`సారీ: కర్మ రిటర్స్న్` అనే రెండు సినిమాలు చేస్తోంది. ఆశలన్ని ఆ రెండు చిత్రాలపైన ఉన్నాయి.