100 మిలియన్స్ తో దుమ్ము రేపింది

Sun Jan 20 2019 20:07:23 GMT+0530 (IST)

Rowdy baby Song Reached 100 Million Views In Youtube

ప్రస్తుతం సాయి పల్లవి టైం నడుస్తోంది. అక్కడ ఇక్కడ టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడాలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు ధనుష్ తో కలిసి 'మారి 2' చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రంలోని రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్ రికార్డులను బద్దలు కొట్టేలా కనిపిస్తుంది. కేవలం రెండు వారాల్లోనే ఏకంగా 100 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది. రౌడీ బేబీ సాంగ్ కేవలం తమిళ ఆడియన్స్ ను మాత్రమే కాకుండా అన్ని భాషల వారిని అలరిస్తున్న నేపథ్యంలో ఈ స్థాయి వస్యూస్ వచ్చాయి.కేవలం రెండు వారాల్లోనే వంద మిలియన్ ల యూట్యూబ్ వ్యూస్ ను దక్కించుకుని రికార్డు సొంతం చేసుకుంది. ఫిదా చిత్రంలోని వచ్చిందే మెల్లగా మెల్లగా వచ్చిందే.. పాట కూడా యూట్యూబ్ లో భారీగా వ్యూస్ ను దక్కించుకుంది. వచ్చిందే.. పాటలో సాయి పల్లవి డాన్స్ కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక రౌడీ బేబీ పాటలో ధనుష్ తో కెమిస్ట్రీ మరియు ఆమె డాన్స్ పాటకు హైలైట్ గా నిలిచాయి. పాట కాన్సెప్ట్ మరియు ట్యూన్ కొరియోగ్రఫీ అంతా కూడా అద్బుతంగా సెట్ అవ్వడం వల్ల ఈ స్థాయిలో యూట్యూబ్ లో ఆ పాట ట్రెండ్ అవుతూ వస్తోంది.

ప్రభుదేవా ఈ పాటకు కొరియోగ్రఫీ అందించగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. ధనుష్ తో పాటు ధీ ఈ పాటను పాడింది. కేవలం రెండు వారాల్లో ఈ స్థాయి వ్యూస్ ను దక్కించుకున్న నేపథ్యంలో సాయి పల్లవి ఫుల్ హ్యాపీగా ఉంది. తన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.