Begin typing your search above and press return to search.

'రౌడీ బాయ్స్' టీజర్: కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా..!

By:  Tupaki Desk   |   20 Sep 2021 2:03 PM GMT
రౌడీ బాయ్స్ టీజర్: కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా..!
X
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ''రౌడీ బాయ్స్''. యూత్ పుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆశిష్ సరసన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ - టైటిల్ సాంగ్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా టీజర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

'రౌడీ బాయ్స్' సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ అండ్ యాక్షన్ డ్రామా అని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. 'కాలేజ్ అనేది వండర్ ఫుల్ ప్లేస్.. ఇక్కడే మీరు ఎవరు ఏమిటి ఏమవుతారనేది డిసైడ్ అవుతుంది.. కాలేజ్ మీకు చదువు తో పాటుగా జీవితాన్ని నేర్పిస్తుంది' అని చెప్పే డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. స్టూడెంట్స్ మధ్య గ్యాంగ్ వార్స్.. వేర్వేరు కాలేజీలకు చెందిన ఆశిష్ - సాహిదేవ్ విక్రమ్ ఇద్దరూ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కోసం గొడవ పడటం వంటివి చూపించారు.

ఇందులో హీరో రౌడీ బాయ్స్ అనే పేరుతో తన బ్యాచ్ ని మెయింటైన్ చేస్తూ కనిపిస్తున్నాడు. షర్ట్ లేకుండా గ్రౌండ్ లో ఫైట్ చేస్తూ ఆశిష్ ఆకట్టుకున్నాడు. ఫస్ట్ సినిమా అయినప్పటికీ స్క్రీన్ మీద ఎనర్జిటిక్ గా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. అనుపమ క్యూట్ గా ఉంది. లవ్ - యాక్షన్ కలబోసిన ఈ టీజర్ విశేష స్పందన తెచ్చుకుంటోంది. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

'రౌడీ బాయ్స్'' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే యూత్ ని ఉర్రూతలూగించేలా డ్యాన్స్ నంబర్ తో అలరించాడు. టీజర్ కు దేవి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. మధే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. మధు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.