టాప్ స్టోరి: కాసులు కురిపిస్తున్న రొమాంటిక్ సీన్స్

Sun Sep 22 2019 07:00:02 GMT+0530 (IST)

Romantic Scenes is Reason for Income in Indian Film Industry

అగ్గి రాజేస్తారు.. కాసులు కొల్లగొడతారు.. ఎంతగా గుండెల్లో వేడి పుట్టిస్తే అంతగా కాసుల కుంభవృష్టి కురుస్తుంది. `రొమాన్స్` కామధేనువు లాంటిది. రొమాంటిక్ సన్నివేశాలు కాసులు కురిపిస్తున్నాయి. అదే అందాల భామలకు సరైన ఆదాయ మార్గం కూడా. అందుకే ఆ దారిలో వెళ్లేందుకు భామలంతా సై అనేస్తున్నారు. స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం రాకపోయినా క్రేజీ హాట్ గాళ్స్ కు హాట్ హాట్ సీన్స్ కాసులు కురిపిస్తున్నాయి. కెరీర్ సంగతి ఎలా వున్నా డబ్బుకు డబ్బు.. క్రేజ్ కి క్రేజ్ వచ్చేస్తోంది. దీంతో చాలా మంది దిగువ స్థాయి హీరోయిన్ లు.. ఐటమ్ నంబర్స్ లో కనిపించే హాట్ గాళ్స్ రొమాంటిక్ చిత్రాల్లో నటించడానికి ఎంత మాత్రం వెనకాడటం లేదు. ఈ వరుసలో అత్యధికంగా వెనకేస్తున్న బ్యూటీ పూనమ్ పాండే. బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూసిన ఈ లేడీ ఆటమ్ బాంబ్ నషా- మాలిని అండ్ కో- లవ్ ఈజ్ పాయిజన్- ది జర్నీ ఆఫ్ కర్మ వంటి చిత్రాల్లో హాట్ హాట్ సీన్లలో అందాలు ఆరబోసి భారీ పారితోషికాల్ని అందుకుంది.ఆ తరువాత స్థానంలో జరీన్ ఖాన్ ఆ స్థాయిలో అందుకుందన్నది ఓ రిపోర్ట్. `వీర్` సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైన జరీన్ కు ఆశించిన స్థాయి అవకాశాలు రాలేదు. దాంతో ఇతర భాషల వైపు చూసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. దీంతో రొమాంటిక్ చిత్రాల బాటపట్టింది. జరీన్ చేసిన హేట్ స్టోరీ-3 ఆమెకు కాసుల వర్షం కురిపించింది. హాట్ హాట్ రొమాంటిక్ బెడ్  రూమ్ సీన్లలో రెచ్చిపోవడంతో ఆ తరహా చిత్రాల ప్రవాహం మొదలైంది. తెలుగులో `రాజు మహారాజు` సినిమాతో పరిచయమైన సుర్విన్ చావ్లా ఆ తరువాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడా పాగా వేయాలని ప్రయత్నించి భంగపడింది. హేట్‌స్టోరీ-2తో అనూహ్యంగా రొమాంటిక్ సినిమాల వైపు మళ్లింది. ఆ తరువాత సుర్విన్ పేరు ఈ జాబితాలో వినిపిస్తోంది. వరుస రొమాంటిక్ చిత్రాలు.. వెబ్ సిరీస్ లతో ఈ అమ్మడు బాగానే ఆర్జిస్తోందట.

శృంగార తార సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సన్నీ కెరాఫ్ ఎరోటిక్ రొమాంటిక్ జోనర్ అన్నంతగా పాపులరైంది. దీంతో మేకర్స్ రొమాంటిక్ చిత్రాల కోసం సన్నీ వెంటపడుతున్నారు. దీంతో సన్నీకి రెమ్యూనరేషన్ బాగానే గిట్టుబాటవుతోంది. ఆ తరువాత వరుసలో ఊర్వశీ రౌతేలా నిలుస్తోంది. కేవలం అగ్గి రాజేసే హాట్ సీన్స్ కోసమే ఈ అమ్మడిని మేకర్స్ ఏరికోరి కోరినంతా ఇచ్చి తీసుకుంటున్నారు. హేట్ స్టోరీ-4 - గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రాల్లో ఊర్వశీ రౌతేలా అందాల ప్రదర్శనకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లే లభించాయి. ఈ తరహా హాట్ కంటెంట్  సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఈ ఐదుగురు బాలీవుడ్ హాటీస్ రెండు చేతులా ఎడాపెడా సంపాదించేస్తున్నారు.