Begin typing your search above and press return to search.

అనుష్కతో రొమాన్స్.. యంగ్ హీరో జాక్ పాట్?

By:  Tupaki Desk   |   7 March 2021 1:30 AM GMT
అనుష్కతో రొమాన్స్.. యంగ్ హీరో జాక్ పాట్?
X
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి న‌టించిన నిశ్శ‌బ్ధం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌రో సినిమాకి అంగీక‌రించ‌డానికి స్వీటీ చాలా ఎక్కువ స‌మ‌య‌మే తీసుకుంటున్నారు. యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది.తొలిచిత్ర‌ దర్శకుడు రమేష్ వినిపించిన‌ స్క్రిప్ట్ న‌చ్చింద‌ని అనుష్క ఓకే చెప్పార‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. బౌండ్ స్క్రిప్ట్ తో యువ‌ద‌ర్శ‌కుడు స్వీటీని క‌న్విన్స్ చేయ‌గ‌లిగారు. దీంతో ప్రాజెక్టుకి ఓకే చెప్పేశారు.

ఈ మూవీ క‌థాంశం ఎలా ఉంటుంది? అంటే.. ఒక బ్యూటిఫుల్ ఫ‌న్నీ ఎలిమెంట్ తో కూడుకున్న డ్రామా ఆక‌ట్టుకుంటుంద‌ట‌. అనుష్కతో రొమాన్స్ చేసే క‌థానాయ‌కుడు ఎవ‌రు? అంటే.. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఏజెంట్ ఆత్రేయ న‌వీన్ పోలిశెట్టి కి ఆ అవ‌కాశం ద‌క్కింద‌ని తెలిసింది.స్వీటీతో జాక్ పాట్ అంటే నవీన్ ‌ల‌క్కీ అనే చెప్పాలి. యువి క్రియేషన్స్ తో క‌లిసి అనుష్క ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ని చెబుతున్నారు. న‌వీన్ పోలిశెట్టి న‌టించిన జాతిర‌త్నాలు ఈ వారంలో రిలీజ‌వుతోంది.