ఒకే హీరోయిన్ తో 130 సినిమాల్లో రొమాన్స్.. హీరో అరుదైన రికార్డ్

Wed Nov 24 2021 18:00:01 GMT+0530 (IST)

Romance in 130 movies with a single heroine

1980 మరియు 90 ల్లో స్టార్ హీరోలు కొంత మంది హీరోయిన్స్ తో వరుసగా సినిమాలు చేసే వారు. వారిది హిట్ పెయిర్ గా అభిమానులు మళ్లీ మళ్లీ వారి కాంబో సినిమాలను కోరుకునే వారు. దాంతో ఒక్కో హీరో అప్పట్లో ఒక్కో హీరోయిన్ తో అయిదు పది అంతకు మించి సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి అస్సలు లేదు. ఒక సారి కలిసి నటించిన హీరో మరియు హీరోయిన్ మళ్లీ కలిసి నటిస్తే జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.ఏదో సూపర్ హిట్ అయిన సినిమా జంట మాత్రం రెండు మూడు సార్లు కలిసి నటించడం మనం చూస్తున్నారు. ఇప్పుడు ఒక హీరో సేమ్ హీరోతో సినిమాలను రిపీట్ చేయడం అంటే మూడు నాలుగు చాలా గొప్ప విషయం. అలాంటిది ఒక హీరో ఒకే హీరోయిన్ తో ఏకంగా 130 సినిమా ల్లో కలిసి నటించాడు.

ఆయన ఏ హాలీవుడ్ హీరోనో.. లేదా కొరియన్ హీరోనో కాదు... అలాగే అతడు ఉత్తరాది కూడా అంతకంటే కాదు. మన సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో.. ఆయన మలయాళ సీనియర్ స్టార్ హీరో ప్రేమ్ నజీర్. 520 సినిమాల్లో ప్రథాన పాత్రల్లో నటించిన ఈయన ఎన్నో వందల విభిన్నమైన పాత్రలను చేసి ఆకట్టుకున్నాడు. ప్రతి పాత్ర కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది.. ప్రతి సినిమాలో కూడా విభిన్నత్వంను చూపించేవాడు. ఈ స్టార్ కు రెండు గిన్నీస్ రికార్డులు దక్కాయి.

520 సినిమాలకు గాను 80 మంది హీరోయిన్స్ తో నటించాడు. అత్యధిక హీరోయిన్స్ తో నటించినందుకు గాను ఈయనకు గిన్నీస్ రికార్డు దక్కింది. ఇక షీలా అనే నటితో ఏకంగా 130 సినిమాల్లో ఈయన నటించాడు. వీరిద్దరి కాంబో ఎన్ని సార్లు వచ్చినా బోర్ కొట్టలేదు. ప్రేక్షకులు ఎన్ని సార్లు వీరిద్దరు వచ్చినా కూడా ఆధరించారు. దాంతో వరుసగా సినిమాలను చేస్తూనే వచ్చారు. ఒకే హీరోయిన్ తో కలిసి 130 సినిమాల్లో నటించినందుకు గాను కూడా ఈయనకు గిన్నీస్ రికార్డు దక్కింది.