Begin typing your search above and press return to search.

బ్యాక్ టు బ్యాక్ దూసుకొస్తున్న తెలుగ‌మ్మాయ్

By:  Tupaki Desk   |   31 July 2021 3:30 PM GMT
బ్యాక్ టు బ్యాక్ దూసుకొస్తున్న తెలుగ‌మ్మాయ్
X
విజ‌యం ఇచ్చే కిక్కే వేరు. బ్యాక్ టు బ్యాక్ విజ‌యాలు ద‌క్కితే డ‌బుల్ కిక్కు. అలాంటి విజ‌యాలను ఆస్వాధిస్తోంది తెలుగ‌మ్మాయి ప్రియాంక జ‌వాల్క‌ర్. ఇంత‌కుముందు టాక్సీవాలా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించిన ఈ బ్యూటీ లేటెస్ట్ ఫిల్మ్ `తిమ్మరుసు`తో మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది.

ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ చేసిన లాయర్ అను పాత్ర‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. `తిమ్మరుసు`లో ప్రియాంక అందంతో క‌వ్విస్తూనే.. పూర్తి న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌తో మెప్పించింది. ఈ సినిమాలో ప్రియాంక న‌ట‌న‌పై ఫిల్మ్ యూనిట్ కూడా ప్రశంసిస్తోంది. ప్రస్తుతం క్రేజీ సినిమాలు కెరీర్ లైనప్ లో ఉన్నాయి.

తిమ్మరుసు విజ‌యం సాధించ‌డంతో టాలీవుడ్ లో మరింత జోరును క‌న‌బ‌రుస్తోంది. ఆగస్టు 6న ప్రియాంక జవాల్కర్ నటించిన మరో కొత్త సినిమా `ఎస్.ఆర్. కళ్యాణమండపం` విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ష్యూర్ హిట్ అనే టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఈ సుందరి దక్కించుకున్నట్లే.

`టాక్సీవాలా` మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ తెలుగు నాయిక.. తొలి చిత్రంతోనే తన గ్లామర్.. పెర్మార్మెన్స్ తో గుర్తింపు తెచ్చుకుంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ గా యంగ్ హీరోలకు.. దర్శకులకు ఫస్ట్ ఛాయిస్ అయ్యింది. ప్రస్తుతం ఆమె బ్యాక్ టు బ్యాక్ మూవీ రిలీజ్ లతో ఆడియెన్స్ ముందుకు వస్తోంది. ఇటీవ‌ల స్లిమ్ లుక్ తో క‌వ్విస్తున్న‌ ప్రియాంక జవాల్కర్ మరింత అందంగా ఆక‌ర్ష‌ణీయంగా కనిపిస్తూ ఇండస్ట్రీని ఆకర్షిస్తోంది. ఆమె నటించిన మరో కొత్త సినిమా `గమనం` కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

యాక్టింగ్ కు స్కోప్ ఉంటూ క్రేజీ ఫిల్మ్స్ తో కెరీర్ ప్లాన్ చేసుకుంటోంది ప్రియాంక జవాల్కర్. నాని- శర్వానంద్ లాంటి నెక్ట్ లెవెల్ హీరోలతో తను మూవీస్ చేస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉందీ బ్యూటీ. అందంగా ఉండి హార్డ్ వర్కింగ్ చేసే టాలెంటెడ్ హీరోయిన్స్ ఎంతోమంది టాలీవుడ్ లో సక్సెస్ అయ్యారు. అలా చూస్తే ప్రియాంక జవాల్కర్ కు త్వరలోనే మరింత స్టార్ డమ్ ద‌క్కించుకునే ఛాన్సుంది. తెలుగు అమ్మాయి కాబట్టి మన ప్రేక్షకులకు ప్రియాంక‌ ఎప్పుడూ స్పెషలే. ఈ రాయ‌ల‌సీమ అమ్మాయి ప్రియాంక .. పీసీ (ప్రియాంక చోప్రా) అంత ఎద‌గాల‌ని ఆకాంక్షిద్దాం.