Begin typing your search above and press return to search.

అబ్బే.. రాఖీ భాయ్ అలా చేస్తే ఏం బాగుంటుంది!

By:  Tupaki Desk   |   30 Jan 2023 8:00 AM GMT
అబ్బే.. రాఖీ భాయ్ అలా చేస్తే ఏం బాగుంటుంది!
X
కేజీఎఫ్‌ సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో కన్నడ స్టార్‌ యశ్‌ సూపర్ స్టార్‌ ఇమేజ్ ను సొతం చేసుకున్న విషయం తెల్సిందే. కేజీఎఫ్ 2 సినిమా విడుదల అయ్యి ఏడాది కాబోతుంది. అయినా కూడా ఇప్పటి వరకు యశ్‌ యొక్క తదుపరి సినిమా గురించి ఎలాంటి క్లారిటీ లేదు. మొన్న బర్త్‌ డేకు సినిమా ను ప్రకటిస్తారు అంటూ ప్రచారం జరిగింది.

బర్త్‌ డే రోజున ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి.. కొత్త సినిమాను ఇంకా కమిట్‌ కాలేదు అన్నట్లుగా అభిమానులకు యశ్‌ ఒక మెసేజ్ ను ఇవ్వడం జరిగింది. ఈ కేజీఎఫ్‌ స్టార్‌ తాజాగా ఒక ప్రాజెక్ట్‌ కు ఓకే చెప్పాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు నెలల్లో ఆ సినిమా పై అఫిషియల్‌ అనౌన్స్ మెంట్‌ వచ్చే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ నితేష్‌ తివారీ.. మధు మంతెన ఇంకా అల్లు వారు తీసుకు రాబోతున్న భారీ రామయణం ప్రాజెక్ట్‌ లో యశ్‌ ను నటింపజేసేందుకు వారు సంప్రదించారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే రాముడి పాత్రకు గాను రణబీర్‌ కపూర్ ను ఫైనల్‌ చేసిన టీమ్‌ రావణుడి పాత్రకు యశ్‌ తో సంప్రదింపులు జరిపారు అంటున్నారు.

యశ్ కు ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో సూపర్‌ స్టార్‌ డమ్‌ ఉంది. ఇలాంటి సమయంలో రావణుడి పాత్ర అంటే విలన్‌ పాత్ర చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ ఆయన అభిమానులతో పాటు చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా రణబీర్‌ కపూర్‌ సినిమాలో ఒక పాత్రను యశ్‌ ఎలా చేస్తాడు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

రాఖీ భాయ్ గా పాన్ ఇండియా స్టార్‌ అయిన యశ్‌ ను అదే స్థాయి పాత్ర తో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కనుక రాఖీ భాయ్ కాస్త ఆలస్యం అయినా కూడా అదే మాస్‌ పాత్రను చేస్తే బాగుంటుంది అంటూ సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు రామయణం యొక్క పుకార్లు ఎంత వరకు కరెక్ట్‌ అనేది యశ్‌ స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.