'ఆడవాళ్లు మీకు జోహార్లు' కోసం రాక్ స్టార్..!

Thu Jul 22 2021 11:46:18 GMT+0530 (IST)

Rock star for 'Adavallu Meeku Joharlu' ..!

యంగ్ హీరో శర్వానంద్ - లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''ఆడవాళ్లు మీకు జోహార్లు''. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ ఎల్ వి సినిమాస్) బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఈ రోజు అధికారికంగా ప్రకటించింది.దేవిశ్రీ ప్రసాద్ ఇంతకముందు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన 'నేను శైలజ' 'ఉన్నది ఒకటే జిందగీ' 'చిత్రలహరి' వంటి చిత్రాలను మ్యూజిక్ అందించారు. ఈ క్రమంగా వీరి కలయికలో నాలుగో మ్యూజికల్ చిత్రంగా ''ఆడవాళ్లు మీకు జోహార్లు'' రానుంది. అలానే ఇది శర్వా - రష్మిక - కిషోర్ తిరుమల కాంబినేషన్ లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం హీరోహీరోయిన్లతో సహా ముఖ్య తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా టైటిల్ ని బట్టి ఇందులో ఫీమేల్ క్యారెక్టర్స్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తుంది. ప్రముఖ నటీనటులు సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడింటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ - రవిశంకర్ - సత్య - ప్రదీప్ రావత్ - గోపా రాజు - బెనార్జీ - కళ్యాణి నటరాజన్ - రాజశ్రీ నాయర్ - ఝాన్సీ - రజిత - సత్య కృష్ణ - ఆర్‌సిఎం రాజు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' చిత్రంలో శర్వానంద్ - రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండనున్నాయని.. కిశోర్ తిరుమల మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిన్నారని.. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మంచి అసెట్ కానుందని చిత్ర యూనిట్ తెలిపింది