నడుము వంపుతో.. షేపులతో ఎదలు మీటుతున్న సుందరి!!

Thu Jul 16 2020 07:00:04 GMT+0530 (IST)

With the curve of the waist .. the beautiful girl with the shape !!

బాలీవుడ్ బ్యూటీ రియా సేన్.. అంటే గ్లామర్ ప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రియా ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో అరుదుగా కనిపిస్తుంది కానీ.. వచ్చినప్పుడే సెగలు రేపుతుంటుంది. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది ఈ బ్యూటీ. మంచు మనోజ్ సరసన 'నేను మీకు తెలుసా' అనే మూవీ చేసి మళ్లీ కనిపించలేదు. దక్షిణ భాషలతో పాటు హిందీ మలయాళ ఒరియా బెంగాలీ చిత్రాల్లో నటించిన రియా ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది. కెరీర్ ఊపులో ఉన్నప్పుడే బాయ్‌ఫ్రెండ్ శివమ్ తివారీని పెళ్లి చేసుకొని బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అయింది. పెళ్ళైన కొత్తలో హానీమూన్ ఫొటోలను కూడా షేర్ చేసి సోషల్ మీడియాలో సంచలనం రేపింది. నిజానికి రియా సేన్ ఎవరో కాదు. ప్రఖ్యాత నటి సుచిత్రా సేన్ మనువరాలు.కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల చిత్రంలో నటించిన మున్ మున్ సేన్ కూతురు. మొదటగా 1991లో బాలనటిగా విషకన్య సినిమాలో నటించి ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించి మంచిపేరు సంపాదించుకుంది. ఇక 2001లో స్టైల్ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. రియా సేన్ దాదాపు 50 చిత్రాలకు పైగా నటించింది. కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా హాట్ మోడల్‌గా కూడా పలు రికార్డ్స్ నెలకొల్పింది. లిమ్కా యాడ్‌లో దీపికా పదుకొనే తర్వాత ఆమె స్థానాన్ని రియా సేన్ కైవసం చేసుకుంది.

రియాసేన్ మరోసారి వేడెక్కించే ఫోటోతో కుర్రకారు మది దోచుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తాజాగా వ్యాయామం చేస్తూ నడుమును విల్లులా వంచిన పిక్ షేర్ చేసింది. అమ్మడి షేపులు.. చూపులు ఎదలను మీటుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి మిలియన్లలో ఫాలోయింగ్ ఉన్న ఈ భామ అభిమానులు ఊరుకుంటారా.. వెంటనే లైక్ కొట్టి వైరల్ చేసేస్తున్నారు.

TAGS: Riya Sen