ఫోటో స్టోరి: బుట్టబొమ్మకే ఎసరు పెట్టేట్టుందిగా..!

Sun Oct 24 2021 14:03:10 GMT+0530 (IST)

Ritu varma At pre Release Event

`పెళ్లి చూపులు` మూవీతో హీరోయిన్ గా కెరీర్ ని ప్రారంభించింది రీతూ వర్మ. నానితో కలిసి `ఎవడే సుబ్రమణ్యం`లో మెరిసినా ఆమెకు గుర్తింపుని తెచ్చిపెట్టింది మాత్రం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో చేసిన `పెళ్లి చూపులు` చిత్రం మాత్రమే. ఈ మూవీతో హీరోయిన్ గా మంచి గుర్తింపుని దక్కించుకున్న రీతూ వర్మ ఆ స్థాయిలో మాత్రం అవకాశాల్ని దక్కించుకోలేకపోయింది. ఇదే సినిమాతో హీరోగా ఎట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ దూసుకుపోతుంటే రీతూ మాత్రం అవకాశాల కోసం ఎదురుచూస్తూ కాలం గడిపేసింది.విక్రమ్ తో గౌతమ్ మీనన్ రూపొందించిన తమిళ చిత్రాన్ని అంగీకరించి ఒక విధంగా తన కెరీర్ కి తానే బ్రేకులు వేసుకున్న రీతూ అదృష్టం తాజాగా మారింది. రీతూ ఇటీవల వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల ఆమె నటించిన `టక్ జగదీష్` థియేటర్లలో రిలీజ్ కాకపోయినా ఆమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయి ఫరవాలేదు అనిపించుకుంది. ఈ మూవీ తరువాత రీతూ వర్మ యంగ్ హీరో నాగశౌర్యతో ఓ మూవీ చేస్తోంది.

`వరుడు కావలెను` పేరుతో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ని చిత్ర బృందం స్టార్ట్ చేసింది. శనివారం రాత్రి `వరుడు కావలెను` సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బుట్టబొమ్మ పూజా హెగ్డే ఛీఫ్ గెస్ట్ గా హాజరు కాగా .. ఈ చిత్ర హీరోయిన్ రీతూ వర్మ బ్లూ సారీ.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో వచ్చి రచ్చ చేసింది. ఈ కర్యక్రమానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. చూస్తుంటే బుట్టబొమ్మకే ఎసరు పెట్టేంత హాట్ గా కనిపిస్తోందంటూ బోయ్స్ నుంచి కామెంట్లు వచ్చి పడుతున్నాయ్. తెలుగమ్మాయి నెమ్మదిగా అన్నివిధాలా ఓపెనవుతుందనేది అందరి అభిప్రాయం.