క్యూట్ కపుల్.. క్యూట్ ఫైట్!

Thu Dec 03 2015 09:38:08 GMT+0530 (IST)

Ritesh Deshmukh and Genelia D Souza at a filmi party

భార్యా భర్తల మధ్య చిరుగొడవలు మామూలే విషయమే. కోపాలొస్తాయ్. చిర్రుబుర్రులుంటాయి. చిరాకులు పరాకులు ఉంటాయ్. ఇవన్నీ ఉంటాయ్ కాబట్టే దానిని సంసారం అంటారు. అందుకే .. బ్యాచిలర్లను భయపెట్టేందుకు సంసారంలో ఈదలేవ్ రా బాబూ ! అనేస్తారు అనుభవజ్ఞులు. అయితే ఇలాంటి గమ్మత్తయిన విషయాల్లేకపోతే జీవితం చప్పగా అయిపోద్ది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యూట్ కపుల్ ని చూస్తే ఆ సంగతి మీకే అర్థమైపోతుంది.అప్పటికప్పుడే కోపాలు - అప్పటికప్పుడు నవ్వుకోవడాలు.. చిరాకులు పరాకులు ఈ మొహాల్లో కనిపించడం లేదూ? ఆ ఎక్స్ ప్రెషన్స్ లో బోలెడన్ని అర్థాలున్నాయి. చిన్నారి బేబిని వదిలేసి ముంబైలోని బాంద్రా పరిసరాల్లో ఓ రెస్టారెంట్ కి వచ్చిన జెనీలియా అండ్ రితేష్ దేశ్ ముఖ్ జంట ఇలా కనిపించారు మరి. శికారుకొచ్చి ఇద్దరూ ఒకరిపైనొకరు చిర్రుబుర్రులాడుకున్నారు. ఏదో విషయంలో ఘర్షణ పడ్డారు. దూరం నుంచి ఫోటోగ్రాఫ్స్ తీస్తే అందులో దొరికిపోయారు. ఒకవేళ బేబిని వెంట తీసుకురానందుకు జెన్నీపై మనోడు విరుచుకుపడ్డాడా?  దానికి జెన్నీ కూడా అంతే ధీటుగా స్పందించిందా? ఏమో.. ఏదైనా జరగొచ్చు.