బాలీవుడ్ అక్కను వదిలిపెట్టని పంత్.. మరీ అంత స్ట్రెస్ తీసుకోకు అంటూ కవ్వింపు

Mon Aug 15 2022 22:00:02 GMT+0530 (IST)

Rishabh Rishabh on urvashi rautela

రెండు వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖుల మధ్య మాటల యుద్ధం జరగటం ఈ మధ్య కాలంలో చూడలేదు. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే అయినా.. ఒక  ప్రముఖ క్రికెటర్.. మరో బాలీవుడ్ బ్యూటీల మధ్య నడుస్తున్న సోషల్ పోస్టుల వార్.. కంటిన్యూ అవుతోంది. నిజానికి ఈ యుద్ధానికి కారణం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అని చెప్పాలి.ఈ మధ్యన ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కోసం ఆర్పీ అనే వ్యక్తి ఎయిర్ పోర్టులో గంటల కొద్దీ వెయిట్ చేశారని చెప్పటం.. ఇంతకీ ఆర్పీ అంటే ఎవరంటే? సమాధానం చెప్పలేదు. తన ఫోన్ కాల్ కోసం పిచ్చివాడిలా వెయిట్ చేశాడని.. తాను షూటింగ్ ఒత్తిడిలో నిద్రపోతే డజన్ల కొద్దీ కాల్స్ చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ ‘ఆర్పీ’ ఎవరంటే మాత్రం చెప్పలేదు.

దీంతో నెటిజన్లు ఆర్పీ అంటే.. రిషభ్ పంత్ గా భావించారు. దీనిపై సాగుతున్న చర్చకు స్పందించిన రిషబ్.. ‘కొందరు ఫేమస్ కావటానికి అబద్ధాలు ఆడతారన్నారు. ‘అక్కా ప్లీజ్ నన్ను వదిలేయ్’ అంటూ ఊర్వశిని ఉద్దేశించి ఇన్ స్టాలో పోస్టు చేశారు.

దీంతో కాలిపోయిన బ్యూటీ స్పందిస్తూ..‘తమ్ముడూ.. నువ్వో పిల్ల బచ్చా.. బ్యాట్.. బాల్ కే పరిమితం’ అంటూ గేలి చేసేలా వ్యాఖ్యానించటంతో పాటు.. వయసులో పెద్ద అయిన ఆడవాళ్ల కోసం పాకులాడే వ్యక్తిగా అభివర్ణించింది. దీంతో మరోసారి స్పందించిన రిషబ్.. ‘నీ అధీనంలో లేని విషయాల గురించి నువ్వు మరీ ఎక్కువగా ఒత్తిడికి లోను కావొద్దు’ అంటూ ఇన్ స్టాలో మరో స్టోరీని పోస్టు చేశారు. ఇలా రిషబ్.. ఊర్వశీ మధ్య నడుస్తున్న పోస్టుల పంచాయితీ సా..గుతూ ఉంది.

ఇదిలా ఉంటే.. ఊర్వశీ ఎపిసోడ్ పై అతని అభిమానులు స్పందిస్తూ..‘భయ్యా ఇలాంటివి పట్టించుకోవద్దు. టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత నీ సొంతం. అనవసరమైన విషయాల మీద శ్రద్ధ పెట్టొద్దు. ఆట మీద ఫోకస్ సారించు’ అంటూ కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ మరింత కాలం సా..గేలా ఉందన్న మాట వినిపిస్తోంది.