Begin typing your search above and press return to search.

ఫిక్ టాక్ : 'నువ్వే కావాలి'కి 20 ఏళ్లు ఆమె మాత్రం అలాగే ఉంది

By:  Tupaki Desk   |   15 Sep 2021 11:30 PM GMT
ఫిక్ టాక్ : నువ్వే కావాలికి 20 ఏళ్లు ఆమె మాత్రం అలాగే ఉంది
X
తరుణ్‌ హీరోగా నటించిన నువ్వే కావాలి సినిమా గుర్తుంది కదా.. 1980 కిడ్స్ కు ఆ సినిమా చాలా ఫేవరేట్ అనడంలో సందేహం లేదు. అప్పట్లో సినిమా ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యింది. ఇటీవలే ఆ సినిమా విడుదల అయ్యి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఆ సినిమా ఇప్పటికి కూడా ఈటీవీలో ప్రసారం అయిన సమయంలో జనాలు టీవీలకు అతుక్కు పోతారు అనడంలో సందేహం లేదు. అంతటి సక్సెస్ ను దక్కించుకున్న ఆ సినిమా లో హీరోయిన్ గా రిచా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా లో నటిస్తున్న సమయంలో రిచా వయసు రెండు పదుల లోపే. అయినా కూడా చక్కని నటనతో ఆకట్టుకుంది. ఆ సినిమా లో తరుణ్‌ కు ఏమాత్రం తగ్గకుండా నటించి మెప్పించింది. మంచి నటిగా గుర్తింపు దక్కించుకున్న రిచా కు అదృష్టం కలిసి రాకపోవడంతో టాలీవుడ్‌ లో స్టార్‌ డమ్‌ దక్కలేదు.

ఆమద్య సినిమాల్లో కనిపించకుండా పోయిన ఈమె మళ్లీ సోషల్‌ మీడియా ద్వారా మళ్లీ తెగ కనిపిస్తుంది. ఈమద్య కాలంలో రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బుల్లి తెరపై కనిపించిన ఈమె మళ్లీ వెండి తెరపై కనిపించే తాపత్రయం చూపిస్తుంది. నాలుగు పదుల వయసులో కూడా ఈమె హీరోయిన్‌ గా ప్రయత్నించబోతుందా అన్నట్లుగా ఈమె వరుసగా సోషల్‌ మీడియాలో హాట్ ఫొటో షూట్ ను షేర్ చేస్తూ ఉంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా అన్ని రకాల ఫొటోలను షేర్‌ చేస్తున్నప్పటికి నాలుగు పదుల వయసులో థైస్ ను ఎక్స్‌ పోజ్ చేస్తూ నడుము అందాలు చూపించాలని తాపత్రయ పడుతున్న ఈమె ఉద్దేశ్యం ఏమై ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

చాలా మంది మాత్రం నువ్వే కావాలి సినిమాలో ఎలా అయితే ఉందో ఇప్పటికి అలాగే ఉంది. ఇరవై ఏళ్లు అయినా కూడా ఈ అమ్మడి అందం మాత్రం తగ్గలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ముద్దుగుమ్మ రిచాకు మళ్లీ టాలీవుడ్‌ లో ఆఫర్లు దక్కాలని ఆమె అభిమానులు ఈ ఫొటోలు చూసిన తర్వాత కోరుకుంటున్నారు. ఐటెం సాంగ్స్ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అయినా ఆమె నటించాలని అభిమానులు ఆశ పడుతున్నారు. మరి అందుకు ఆమె ఓకే చెబుతుందా.. అందాల ఆరబోత తో ఆఫర్లు వస్తే కాదనకుండా కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి.