Begin typing your search above and press return to search.

అమెరిక‌న్ ని పెళ్లాడి అలా బుక్క‌యిన హీరోయిన్

By:  Tupaki Desk   |   26 Nov 2020 6:15 AM GMT
అమెరిక‌న్ ని పెళ్లాడి అలా బుక్క‌యిన హీరోయిన్
X
ఇటీవ‌ల అందాల క‌థానాయిక‌లు పెళ్లి త‌ర్వాత న‌టిస్తున్నారు. కొంద‌రైతే న‌ట‌న‌తో పాటు సినీనిర్మాణం అంటూ సొంత బ్యాన‌ర్లు ప్రారంభిస్తున్నారు. కానీ వీట‌న్నిటికీ దూరంగా పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు స్వ‌స్థి చెప్పింది రిచా గంగోపాధ్యాయ్. కెరీర్ ప‌రంగా ఆశించిన స్థాయి ద‌క్క‌క‌పోవ‌డంతో ఆ త‌ర్వాత ఎంబీఏ చ‌దివేందుకు అమెరికా వెళ్లిపోయింది. అక్క‌డే క్లాస్ మేట్ లాంగెల్లాతో ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. క్లాస్ మేట్ ని పెళ్లాడేస్తున్నా అంటూ రిచా స‌డెన్ ట్విస్టిచ్చింది.

పెళ్లి త‌ర్వాత ఇక పూర్తిగా సినిమాల‌కు స్వ‌స్థి చెప్పేసింది. ప్ర‌స్తుతం భ‌ర్త‌తో క‌లిసి సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఆయనే లోకంగా బ‌తికేస్తోంది!

నా భర్త జో లాంగెల్లా మిలటరీకి.. ఈ దేశాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన అన్ని శాఖల వారియ‌ర్స్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తాజాగా ఎమోష‌న‌ల్ ట్వీట్ చేసింది రిచా. త‌న భ‌ర్త అమెరికా మిల‌ట‌రీ అధికారి అన్న సంగ‌తిని మ‌రోసారి గుర్తు చేసింది.

రిచా తెలుగులో లీడర్- మిరపకాయ్-భాయ్ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. ధనుష్ సరసన సెల్వ రాఘవన్ దర్శకత్వంలో చేసిన `మయక్కం ఎన్నా` చివరి సినిమా. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం కెరీర్ ని విడిచిపెట్టేసిన ఈ భామ భ‌ర్త‌తో సంసార జీవ‌నాన్ని ఆస్వాధిస్తోంది. ఇలా జీవించ‌డం సంతోషంగా ఉంద‌ని రిచా ప్ర‌తిసారీ వెల్ల‌డిస్తోంది.