Begin typing your search above and press return to search.

డార్లింగ్ ని పిచ్చిగా అభిమానించిన బ్యూటీ

By:  Tupaki Desk   |   5 April 2020 5:30 PM GMT
డార్లింగ్ ని పిచ్చిగా అభిమానించిన బ్యూటీ
X
డార్లింగ్ ప్ర‌భాస్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గాళ్స్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. బాహుబ‌లుడిగా పాన్ ఇండియా స్టార్ గా ఎద‌గ‌క ముందే మ‌గువ‌ల్లో ప్ర‌భాస్ కి అంత గొప్ప ఫాలోయింగ్ ఉంది. ఇక ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించిన ప‌లువురు క‌థానాయిక‌లు అత‌డితో ప్రేమ‌లో ప‌డ్డార‌న్న ప్ర‌చారం కూడా ఉంది. అనుష్క‌- త్రిష వంటి అగ్ర తార‌ల‌పైనే ఇలాంటి ప్ర‌చారం సాగింది.

ఇక‌పోతే ప్ర‌భాస్ స‌ర‌స‌న మిర్చి చిత్రంలో న‌టించింది రిచా గంగోపాధ్యాయ్. ఈ ఎన్నారై బ్యూటీ రానా స‌ర‌స‌న లీడ‌ర్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది. అటుపై ర‌వితేజ‌.. గోపిచంద్.. ప్ర‌భాస్ లాంటి స్టార్ల స‌ర‌స‌న న‌టించింది. అయితే అంత‌మందిలో డార్లింగ్ ప్ర‌భాస్ అంటే త‌న‌కు ఎంత ఇష్ట‌మో తాజాగా సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ తో జ‌రిగిన ఇంట‌రాక్ష‌న్ లో బ‌య‌ట‌పెట్టింది.

``ప్ర‌భాస్ గొప్ప మాన‌వ‌తా వాది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే హీరో. నా స‌హ‌న‌టుల్లో నాకు ఎంతో న‌చ్చిన స్టార్`` అంటూ పొగిడేసింది రిచా. ఇక ఈ చిట్ చాట్ లో రిచా అభిమానులు మాత్రం `రిచా అక్క .. ప్ర‌భాస్ బావ` అంటూ స‌ర‌దాగా ముచ్చ‌టించేయ‌డం ఆక‌ట్టుకుంది. ఇక‌పోతే త‌న‌ను అలా ప్ర‌స్థావించినందుకు ఈ భామ నొచ్చుకోలేదు. రిచా తెలుగులో ఓ డ‌జ‌ను సినిమాల్లో న‌టించింది. అటుపై కెరీర్ అంతంత మాత్రంగా ఉండ‌డంతో అమెరికాలో స్ట‌డీస్ కి వెళ్లిపోయి అక్క‌డే త‌న క్లాస్ మేట్ అమెరిక‌న్ అయిన జో లాంగెల్లాతో ప్రేమ‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. 2019 డిసెంబ‌ర్ లో అత‌డిని పెళ్లాడి లైఫ్ లో సెటిలైంది. ప్ర‌స్తుతం సినిమాలు వ‌దిలేసి సంసార సాగ‌రంలోనే బిజీగా ఉంది మ‌రి.