ఫోటో స్టోరీ: రీల్ షకీలా రచ్చో రచ్చ

Tue Oct 15 2019 14:29:09 GMT+0530 (IST)

హిందీ సినిమాలు చూసేవారికి బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా పేరు తెలిసే ఉంటుంది.  ఎక్కువగా ఆఫ్ బీట్ స్టైల్ చిత్రాలలో నటించే ఈ భామకు మంచి గుర్తింపే ఉంది.  'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 1 & 2'.. 'ఫక్రే'.. 'సరబ్జీత్'.. ఇలా విమర్శకులు మెచ్చే సినిమాల్లోనే నటించింది.  సినిమాల విషయంలో ఆఫ్ బీట్ స్టైల్ ఫాలో అవుతుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ హాట్ స్టైలే.  రీసెంట్ గా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు "అక్టోబర్ హీట్ ను తప్పించుకునేందుకు ఇలా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఫోటోలో ఒక పర్పుల్ కలర్  బికినీలో స్విమ్మింగ్ పూల్ ఒడ్డున మెట్ల దగ్గర యమా సెక్సీగా కూర్చుంది. డీ.. ప్ వి-నెక్ కావడంతో హాట్ నెస్ రెట్టింపయింది. సగం శరీరం నీటిలో.. మిగతా సగం బైటపెట్టి ఎంతో సెన్సువల్ గా పోజిచ్చింది. ఈ ఫోటోను టాప్ వ్యూ లో క్లిక్ చేయడంతో టాప్ లేచిపోయిందంటే నమ్మండి.  ఈ నీటిలో సేదదీరి ఆమెకు అక్టోబర్ హీటు తగ్గి ఉంటుందేమో కానీ ఈ ఫోటోతో ఆమె పెంచిన సోషల్ మీడియా హీటును నెటిజన్లు ఎలా తగ్గించుకుంటారో మరి.

ఈ ఫోటోకు చాలానే చిలిపి కామెంట్లు వచ్చాయి.  "అక్టోబర్ హీట్.. రిచా చద్దా హాట్". "నవంబర్.. డిసెంబర్ లో కూడా హీట్ ఉండాలి".. "సల్మా హేక్ లా ఉన్నావు" అంటూ కామెంట్లు పెట్టారు.  లాస్ట్ కామెంట్లో ఉన్న సల్మా హేక్ ఎవరో తెలుసా? హాలీవుడ్ బ్యూటీ.. బేసిక్ గా మెక్సికన్ కానీ తర్వాత అమెరికన్ అయింది.  తన హాటు ఫోటోలతో  ఒకప్పుడు ప్రపంచాన్ని గంగవెర్రులెత్తించిన భామ.  సరే.. ఆమె సంగతి సరేగానీ మళ్ళీ మన రిచా సినిమాల విషయానికి వస్తే షకీలా బయోపిక్ 'షకీలా' లో నటిస్తోంది.  ఈ సినిమా కాకుండా మరో నాలుగు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.