వీడియో: 57 ఏళ్ల భామ్మ ప్రేమలో 13 ప్రాయం పసోడు

Fri May 13 2022 11:14:47 GMT+0530 (IST)

Ricchi e Poveri Come Vorrei song news

ఆమెను చూడనిదే ఉండలేడు. ఆమె కోసం పరితపించిపోతాడు. రెప్ప వాల్చకుండా తననే చూస్తాడు. వీధిలో వెళ్లినా ఉద్యోగానికి వెళుతున్నా ఇంటికి పోతున్నా తననే వెంబడిస్తాడు. చాటు మాటుగా తన చుట్టూ తిరుగుతుంటాడు. కానీ తనకి ఏమీ చెప్పడు.. చెప్పలేడు.. ఎందుకిలా? ఇదంతా టీనేజీ మాయ.ఆమె వయసుతో ఆ బాలకుడికి పని లేదు. ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడు. ఆమె వలపు తలపు తనను మాయ చేస్తోంది. ఆ మత్తులోనే అలా ఉండిపోతున్నాడు. ఇలా అయితే ఏమైపోతాడో కానీ!

ఇంతకీ వీడికి ఏమైంది? అని తెలుసుకునే లోగానే ఆమె 60 ఏళ్ల తన హబ్బీతో ప్రత్యక్షమైంది. తన నుంచి దూరంగా రైలులో వెళ్లిపోయింది. ఓవరాల్ గా ఈ థీమ్ చూస్తుంటే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది.

50 ప్లస్ ఏజ్ భామతో 13 ప్రాయం పసోడు ప్రేమలో పడితే అది వినేందుకు చాలా ఫన్నీగా ఉంది కానీ.. ఈ సాంగ్ మాత్రం ఆద్యంతం సీరియస్ టోన్ తో సాగుతుంది. ఇది ఇప్పుడే విడుదలైన సాంగ్ కాదు. చాలా కాలం క్రితమే వచ్చింది. 2018 డిసెంబర్ లో విడుదలైన ఈ క్లాసిక్ ఫారిన్ సింగిల్ ఆద్యంతం మేకింగ్ పరంగా హైస్టాండార్డ్స్ తో అద్భుతమైన థీమ్ తో ఆకట్టుకుంది.

50 ప్లస్ అంటేనే వృద్ధాప్యంగా చూస్తున్నారు. కానీ ఇప్పుడు 50 ప్లస్ బ్యూటీ ఏకంగా 13 ప్రాయం పసోడిని బుట్టలో వేసింది. సదరు బాలకుడు తనని ఆరాధనగా చూడడం తన వెంటే పడడం తనకోసం పడిగాపులు పడడం ఇదంతా ఎంతో అందంగా అద్భుతమైన ఫ్రేమ్స్ లో బంధించిన తీరు ఆకట్టుకుంది.

Ricchi e Poveri - Come Vorrei (Malena -Monica Bellucci) సాంగ్ ఇది. 2018 డిసెంబర్ 2న ఈ వీడియో సాంగ్ విడుదల కాగా.. ఇప్పటికి 67 487 750 (6.8 కోట్ల) వ్యూస్ దక్కాయి. తన అందచందాలకు దాసోహం అనని యువకుడు ఎవరు? అనేంత అందంగా ఈ వీడియోలో మోనికా బెలూసీ కనిపించింది. మోనికా బెలూసీ ఏజ్ ఇప్పుడు 57. ఈ వీడియోని షూట్ చేసింది నాలుగేళ్ల క్రితం. అంటే అప్పటికి 50 ప్లస్ లోనే ఉంది. ఇక నిక్కరు తొడుక్కుని స్కూల్ కుర్రాడిగా కనిపించిన ఆ యువకుడు ఇప్పుడు కాలేజ్ చదువు పూర్తి చేసుకునే పనిలో ఉన్నాడు.