బికినీ బీచ్ లో మనోజ్ హీరోయిన్ కొత్త బిజినెస్

Wed May 12 2021 23:00:01 GMT+0530 (IST)

Ria Sen Latest Photo

మంచు మనోజ్ సరసన `నేను మీకు తెలుసా?` అనే చిత్రంలో నటించింది రియా సేన్. క్యూట్ లుక్స్ హాట్ అప్పియరెన్స్ ఈ అమ్మడి  ప్రత్యేకత. తొలి ప్రయత్నమే ఫెయిలవ్వడం రియాకు పెద్ద మైనస్ అయ్యింది. అటుపై బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినా అక్కడా అంతంత మాత్రమే. ఇటీవల అసలు ఆఫర్లు అన్నవే లేవు. దీంతో సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో యోగా భంగిమలతో హీట్ పెంచేస్తోంది. ఇటీవల రియా బాత్ టబ్ ఫోటోషూట్ తో ఫ్యాన్స్ లో వైరల్ అయ్యింది. ఆ తర్వాత  యోగా పాఠాల్ని చెప్పేందుకు టీచర్ గా అవతారమెత్తింది. యోగా క్లాసులు చెబుతున్న ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.తాజాగా మరో కిల్లింగ్ ఫోటోని షేర్ చేసింది. రియా తన కొత్త బిజినెస్  బలిస్యా ఈవెంట్ ప్లానర్ పేరుతో స్పాబిజినెస్ లో ప్రవేశించింది. బలిస్వా అనేది రిసార్ట్ కం వెల్ నెస్ సెంటర్. ఇక్కడ వెల్ నెస్ మైండ్ ఫ్రీనెస్ కి సేవలు చేస్తుందట.

తన ప్రవృత్తికి తగ్గట్టే తన లేటెస్ట్ సెల్ఫీలు యూత్ ని అలరిస్తున్నాయి. ఫిషీ అంటూ చేప ఈమోజీని షేర్ చేసిన రియా హాట్ బికినీ ఫోటో ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇంతకుముందు లోన్ లీ గర్ల్ అనే లఘు చిత్రంతో ఆకట్టుకున్న రియా ఆ తర్వాత వేరొక ప్రాజెక్ట్ కి కమిట్ కాలేదు ఎందుకనో. కనీసం వెబ్ సిరీస్ మాధ్యమంలోకి కూడా ప్రవేశించకపోవడం ఆశ్చర్యం కలిగించేదే.