ఫోటో స్టొరీ: ఆ మ్యాగజైన్ కోసం తూనీగ పోజు!

Sun Apr 14 2019 07:00:02 GMT+0530 (IST)

Rhia Chakraborthy Poses For FHM

రియా చక్రబర్తి తెలుసా? ఎంటీవీ వీజే గా కెరీర్ మొదలు పెట్టిన రియా తర్వాత కాలంలో సినిమా హీరోయిన్ గా మారింది. ఈ ముంబై భామ టాలీవుడ్లో 'తూనీగా తూనీగా' అనే సినిమాలో కూడా నటించింది.  ఇక హిందీలో ఓ అరడజను సినిమాల్లో నటించింది. ఈ పాప మీకు గుర్తు రాలేదంటే 'జలేబి' అనే హిందీ సినిమా జిమ్నాస్టిక్ ముద్దుల పోస్టర్లు గుర్తు తెచ్చుకోండి.. ట్రైన్ కిటికీ నుంచి వేలాడుతూ హీరో కు ముద్ధిచ్చిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒకవేళ అది మీరు మిస్ అయి ఉంటే ఇప్పుడే చూసేయండి.  అలాంటి కళాఖండాలను ఆస్వాదించకపోతే ఈ వెధవ జీవితం వృధా!'జలేబి' లాంటి నోరూరించే సినిమాలలో స్పైసీగా నటించడమే కాదు.. సోషల్ మీడియాలో ఘాటు పోజులివ్వడంలో కూడా ఈ బ్యూటీ స్పెషలిస్టు.  తాజాగా FHM ఇండియన్ మ్యాగజైన్ కోసం హాట్ ఫోటో షూట్ చేసింది.  కవర్ పేజిపై బికినీ అవతారంతో పాటూ లోపలి పేజీలలో డిఫరెంట్ గెటప్పులలో దర్శనమిచ్చింది.  పైన కనిపిస్తున్న ఫోటో అందులో ఒకటి.  ఇన్నర్ వేర్ కనిపించేలా నైట్ రోబ్ ను ఊరికే పైన వేసుకుంది.  బెడ్ పైన కూర్చుని నవ్వుతూ ఒక లాంటి ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.  రియా ముందేమో ఒక ట్రే లో పండ్లూ..  జ్యూసు.. పాలు ఉన్నాయి.  పండ్లలో ఒక యాపిల్ ను రామచిలకలాగా సగం కొరికిపెట్టింది.  అసలు ఆ పండ్లు ఎందుకో... దానికి మ్యాచింగ్ గా క్లీవేజ్ షో ఎందుకో కలాపోసన ఉన్న వారికే అర్థం కావాలి.

ఇక సినిమాల విషయానికి వస్తే 'జలేబీ' తర్వాత మరో సినిమా సైన్ చేయలేదు. మరి ఈ పాలు.. పండ్లు.. జ్యూసు.. స్పైసీ ఫోటోలు చూసి ఎవరైనా బాలీవుడ్ ఫిలిం మేకర్లు రియాకు ఆఫర్లు ఇస్తారేమో వేచి చూడాలి.  అయినా మన పిచ్చిగానీ వాళ్ళు ఆఫర్ ఇచ్చేంతవరకూ ఈ హాటుఫోటోల ఋతురాగాలు ఆగవు!