3 నెలలో సుశాంత్ నుండి 3 కోట్లు లాగిన రియా?

Sun Aug 02 2020 16:20:00 GMT+0530 (IST)

Rhea pulls Rs 3 crore from Sushant in 3 months?

సుశాంత్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ముంబయి పోలీసులు మాత్రం కేసును చాలా లైట్ గా విచారించారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీసులకు రియా మరియు ఆమె కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ కేసు పెట్టాడో అప్పటి నుండి అసలు కథ మొదలైంది. రియా గురించి పాట్నా పోలీసులు రాబడుతున్న విషయాలు షాకింగ్ గా ఉంటున్నాయి. పాట్నా పోలీసుల విచారణలో రియా గురించి ఆమె చేసిన మోసాల గురించి తెలిసింది అంటూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి.సుశాంత్ బ్యాంకు ఖాతాలు పరిశీలించిన పాట్నా పోలీసులు మూడు నెలల్లో మూడు కోట్ల రూపాయలు రియా చక్రవర్తి అకౌంట్ కు బదిలీ అయినట్లుగా గుర్తించారని జాతీయ మీడియా వార్త ప్రచురితం చేసింది. కేకే సింగ్ ఇప్పటికే 15 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసును పెట్టడం జరిగింది. సుశాంత్ క్రెడిట్ కార్డ్ ను కూడా రియా చక్రవర్తి వదలకుండా వాడేసిందని ఆమె అకౌంట్స్ కు డబ్బు బదిలీ అవ్వడంతో పాటు తన ప్రతి షాపింగ్ అవసరంను కూడా సుశాంత్ అకౌంట్ నుండి వినియోగించుకుందని కేకే సింగ్ ఆరోపిస్తున్నాడు.

మరో వైపు రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లుగా జాతీయ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రియా చక్రవర్తి బ్యాంకు ఖాతాల్లో భారీగా డబ్బు ఉండటం అది సుశాంత్ కు చెందినదే అంటూ అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఆమె మరింతగా చిక్కుల్లో పడ్డట్లే అంటూ న్యాయ నిపుణులు అంటున్నారు. సుశాంత్ ను ఆర్థికంగా మరియు ప్రేమ పరంగా మోసం చేయడం వల్లే ఆయన మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడేమో అంటూ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.