అభినవ ద్రౌపదిగా రియా చక్రవర్తి సంచలనాలకు రెడీ!

Thu Jun 10 2021 08:00:01 GMT+0530 (IST)

Rhea Chakraborty Sensations as Innovative Draught

`తూనీత తూనీగ` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రియా చక్రవర్తి పేరు ఇటీవల బాలీవుడ్ డ్రగ్ రాకెట్ లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దివంగత యువకథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేయసిగా రియా పేరు హెడ్ లైన్స్ లోకి వచ్చింది. డ్రగ్స్ కుంభకోణంలో ఎన్.సి.బి విచారణను.. సుశాంత్ బలవన్మరణం కేసులో సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంది.ప్రస్తుతం రియా బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే రియా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారమైంది. ఇంతలోనే రకరకాల కారణాలతో నిరంతరం హెడ్ లైన్స్ లో నిలిచిన రియా పేరును ప్రఖ్యాత టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 జాబితాలో నంబర్ 1 స్థానం లో ప్రకటించడంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇది ఒకరి శారీరక సౌందర్యం లేదా అందం ఆధారంగా మాత్రమే నిర్ణయించబడినది కాదు... రియా ధృఢమైన వ్యక్తిత్వానికి ప్రజలు ఓటేశారని తెలుస్తోంది. టైమ్స్ 50 మోస్ట్ కావాల్సిన మహిళల 2020 జాబితాలో రియా చక్రవర్తి అగ్రస్థానంలో నిలిచింది.

తాజా సమాచారం మేరకు పురాణేతిహాసం మహాభారతం స్ఫూర్తితో భారీ ప్రాజెక్ట్ కి ఎంపికైందని పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఇది మహాభారతం లో ద్రౌపది పాత్రపై ప్రత్యేకమైన భిన్నమైన భారీతనం నిండిన ప్రాజెక్ట్.  ఆధునిక ప్రపంచంతో కనెక్టివిటీ ఉన్న కథాంశమిది. ఇంతకు ముందు తెరపై ఇలాంటి ప్రయోగం చేయలేదు. ద్రౌపది పాత్రను రియా అంగీకరించింది. ప్రస్తుతం స్క్రిప్టును పరిశీలిస్తోంది. చర్చలు సాగిస్తున్నారు`` అని కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై రియా అధికారికంగా స్పందించాల్సి ఉంది.

ఒక ఊహించని పెను తుఫాన్ నుంచి బయటపడి సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్న రియాకి ఈ ప్రాజెక్ట్ బిగ్ బూస్ట్ అవుతుందనే భావిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ 19 కష్టకాలంలో ప్రజలకు తనవంతు సాయమందించేందుకు రియా కృషి చేస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.