వర్మ స్టైల్ మదర్స్ డే విషెష్

Sun May 09 2021 17:42:54 GMT+0530 (IST)

Rgv Wishes Mother Day In His Typical Style

పెళ్లి... కుటుంబ బందాలు బాధ్యతలపై పెద్దగా ఆసక్తి చూపించని రామ్ గోపాల్ వర్మ అందరిది ఒక దారి అయితే తనది మరో దారి అన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటాడు. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ ట్వీట్స్ చేసే రామ్ గోపాల్ వర్మ నేడు మదర్స్ డే సందర్బంగా చేసిన ట్వీట్ కూడా చర్చనీయాంశం అయ్యింది. హ్యాపీ మదర్స్ డే అంటూ అందరు కూడా తమ అమ్మలతో ఉన్న పొటోలను లేదంటే అమ్మ గురించి ఏదైనా మంచి కొటేషన్ ను షేర్ చేస్తూ ఉంటారు. కాని వర్మ అలా చేస్తే వర్మ ఎలా అవుతాడు. అందరిది ఒక దారి అయితే తనది మరో దారి అన్నట్లుగా వర్మ ఒక విభిన్నమైన వీడియోను షేర్ చేశాడు.తల్లులు కొడుకులను కొడుతున్న వీడియోను షేర్ చేశాడు. అందులో ఎదిగిన కొడుకులను చావ బాదుతున్న తల్లులను వర్మ చూపించాడు. హ్యాపీ మదర్స్ డే అంటూ వర్మ షేర్ చేసిన ఈ వీడియో నవ్వు తెప్పిస్తుంది. కొందరు అమ్మలు ఇలాగే ఉంటారు. అయినా కూడా అమ్మలు కొట్టినా కొడుకుల బాగు కోసమే కదా అందుకే హ్యాపీ మదర్స్ డే అమ్మ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్క రోజే అమ్మ తో మంచిగా ఉన్న ఫొటోను పెట్టడం ఏంటీ ఇలాంటి వీడియో పెట్టి అప్పుడు హ్యాపీ మదర్స్ డే అంటూ విషెష్ చెప్పాలని మరి కొందరు వర్మ వీడియోకు స్పందిస్తున్నారు. వర్మ మదర్స్ డే స్పెషల్ మీడియాను మీరు చూడండి.