Begin typing your search above and press return to search.

ఆ గంట మ‌గాడికి 23 గంట‌లు ఆడాళ్ల‌కే!-ఆర్జీవీ

By:  Tupaki Desk   |   20 Jun 2021 6:52 AM GMT
ఆ గంట మ‌గాడికి 23 గంట‌లు ఆడాళ్ల‌కే!-ఆర్జీవీ
X
శృంగారంపై ఒక్కొక్క‌రి అభిప్రాయాలు ఒక్కోలా ఉంటాయి. పెళ్లి చేసుకోవ‌డం లేదా అమ్మాయిల‌తో శృంగారాన్ని ఆస్వాధించి ఆ త‌ర్వాత ఎవ‌రి దారి వారిదే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించే భావ‌జాలంపైనా రామ్ గోపాల్ వ‌ర్మ అండ్ కో ఓపెన్ గానే ఎవ‌రి అభిప్రాయం వారు చెబుతూనే ఉంటారు.

ఆర్జీవీతో అరియానా ఇంట‌ర్వ్యూలో ఇలాంటి బోల్డ్ టాపిక్ చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇందులో సెక్స్ గురించి వ‌ర్మ బోల్డ్ కామెంట్లు చేశారు. అస‌లు ఈ ఇంట‌ర్వ్యూకి వ‌చ్చే గంట ముందే శృంగారం చేశాన‌ని వ‌ర్మ చెప్పారు. నిన్ను చూస్తూ లోలోన శృంగారం చేస్తున్నాను! అది ఒక భావ‌న మాత్ర‌మే అంటూ వ‌ర్మ చేసిన వ్యాఖ్య‌లు చూస్తుంటే టూమ‌చ్ అనిపించ‌వ‌చ్చు. కానీ దీనివెన‌క ప్ర‌జ‌ల్లో ఉద్వేగాల్ని అత‌డు రెచ్చ‌గొట్ట‌ద‌లిచార‌న్న‌ది స్ప‌ష్ఠ‌మ‌వుతోంది. ఈ ఇంట‌ర్వ్యూకి ఒక ప‌ర్ప‌స్ ని ఆపాదించారు ఆర్జీవీ.

ఒక సెన్సిటివ్ అంశంలో మ‌నిషి అంత‌ర్గ‌త భావ‌జాలాన్ని బ‌హిర్గ‌తం చేయ‌డ‌మే ఈ ఇంట‌ర్వ్యూ ఉద్ధేశ‌మా? కోరిక‌ల్ని దాచుకోవ‌డం అణ‌గారి లోలోన మ‌ద‌న ప‌డిపోవ‌డం అనే భావ‌జాలానికి వ‌ర్మ అండ్ కో ఎప్పుడూ వ్య‌తిరేక‌మా? ఇలా ర‌క‌ర‌కాల డౌట్లు పెట్టేసారు ఈ చాటింగ్ తో..

కేవలం ఆ కోరిక‌తోనే అమ్మాయిలతో గ‌డిపే అల‌వాటుంద‌ని అనుబంధాలు త‌న‌కు అవ‌స‌రం లేద‌ని సూటిగానే చెప్పారు ఆర్జీవీ. దానివ‌ల్ల ఆడాళ్ల‌కే లాభం. అమ్మాయిల టైమ్ కేవలం గంట మాత్రమే మ‌గాళ్ల చేతిలో ఉంటుంది. మిగిలిన‌దంతా వారికే వ‌దిలేసిన‌ట్టు అంటూ త‌న‌దైన ఫిలాస‌ఫీని ఆవిష్క‌రించారు. ఒకే వ్య‌క్తితో క‌మిటైతే శృంగారంలో సంథింగ్ మిస్స‌యిన‌ట్టేన‌ని శ‌ర్మ అన్నారు. ఇది అతివాద‌మా మిత‌వాద‌మా? అన్నది ప్ర‌జ‌లు నిర్ణ‌యించాల్సి ఉంటుంది.