తత్వవేత్తల పుస్తకాలు చదివి ఆర్జీవీలో అల్లకల్లోలం వెనక కారకుడు?!

Mon Apr 19 2021 09:00:01 GMT+0530 (IST)

Rgv Talking About Satyendra

మందలో ఒకడిగా కాదు. మందను నడిపించే ఒకడిగా ఉండాలని అంటారు. లేదా మందను కనీసం ఆలోచింపజేసేవాడిగా అయినా ఉండాలనేది ఫిలాసఫీ. అలాంటి లక్షణాలు ఉన్నవాళ్లు అరుదు. కానీ నేటి సమాజంలో ఫిలాసఫీ సైకాలజీ చదువుకుని తాము ఏదో సాధించేసామని భావించేవారు .. సంఘాన్ని అల్లకల్లోలం చేసేవారు లేకపోలేదు. ఇక ఆర్జీవీ విషయానికి వస్తే ఆయన ఏం మాట్లాడినా అది వినేవాళ్లకు వితండ వాదంలా ఉంటుంది. ఇంతకీ ఆయనలో వితండవాదం లేదా లౌకిక తాత్విక జ్ఞానం ఎలా అబ్బింది? అన్నది అందరికీ ఒక ఫజిల్.దానికి తాజా ఇంటర్వ్యూలో ఆయనే సమాధానం ఇచ్చారు. తత్వవేత్తల పుస్తకాలు చదివి ఆర్జీవీ అల్లకల్లోలం సృష్టించడానికి కారకుడు ఎవరో కూడా ఆయనే చెప్పేశారు. ఇంతకీ ఆర్జీవీ వెనక ఉన్న ఆ షాడో ఎవరు? అంటే...

అతడి వెనక షాడో సత్యేంద్ర అని చెప్పారు. ఆర్జీవీ మాట్లాడుతూ-``నన్ను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో సత్యేంద్ర అనే నా కాలేజ్ జూనియర్ ఒకడు. నన్ను తీవ్రంగా ప్రభావితంగా చేసిన వ్యక్తుల్లో అతడు ఉన్నాడు. అతడి వల్లనే నేను ప్రపంచ ప్రసిద్ధి చెందిన తత్త్వవేత్తల పుస్తకాలు చదవగలిగాను. నా చుట్టూ ఉన్న సమాజంలోని కట్టుబాట్లను విలువలను ఛేదించగలిగాను. ఒక్క మాటలో చెప్పాలంటే నిజమైన స్వేచ్ఛా జీవిగా మారాను. అందుకే సత్యేంద్రను ఎప్పటికీ మరువలేను. ఏదైనా టాస్క్ వస్తే `అతడు ఆ రోజే చెప్పాడు కదా!` అనిపిస్తుంది`` అంటూ చాలా కఠోర నిజాన్ని చెప్పారు.

ఏజ్ తో పాటే మార్పు వచ్చిందని ఆధిపత్య భావజాలం కూడా మారిందని ఆర్జీవీ అన్నారు. ఒకప్పుడు తీవ్రంగా ఆవేశం కలిగించిన విషయాలే సామాన్యంగా అనిపించాయని.. ఒకప్పుడు ఎవరినైనా నియంత్రించడానికి వారిపై ఆధిపత్యమే చెలాయించటమే సరైన మార్గమని అనుకొనేవాడినని తెలిపారు. అయితే వ్యక్తుల నేపథ్యం ప్రభావం వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది.. నన్నే నమ్మాలనుకోవడం సరికాదని తెలుసుకున్నా అని తెలిపారు.