Begin typing your search above and press return to search.

ట్రంప్ పై ఆ లెవ‌ల్లో పంచ్ లేసిన ఆర్జీవీ

By:  Tupaki Desk   |   24 Feb 2020 7:31 AM GMT
ట్రంప్ పై ఆ లెవ‌ల్లో పంచ్ లేసిన ఆర్జీవీ
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త ప‌ర్య‌ట‌న గురించి తెలిసిందే. ఆయ‌నను ఇప్ప‌టికే విమ‌నాశ్ర‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్వ‌యంగా రిసీవ్ చేసుకున్నారు. అయితే ట్రంప్ ప‌ర్య‌ట‌న‌పై వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లతో విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. నిన్న‌టి నుంచే ఆర్జీవీ ఎటాక్ స్టార్ట‌య్యింది. అది ఇప్ప‌టికి పీక్స్ కి చేరుకుంది.

ట్రంప్ కోసం జ‌నాల్ని పోగేయ‌డంపైనా.. ఈ ప‌ర్య‌ట‌న పేరుతో కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌డంపైనా ఆయ‌న పంచ్ లు వేసేశాడు. ఇక ఈ పంచ్ ల వెల్లువ‌లో ఆర్జీవీ ఏమాత్రం జంక‌కుండా విరుచుకుప‌డుతున్నాడు. తాజా ట్వీట్ లో అత‌డు చెల‌రేగాడు. ``ట్రంప్ కు స్వాగ‌తం ప‌లికే స‌మ‌యం లో నిర్వ‌హించే సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను చూసి అత‌డు బోర్ ఫీల‌వుతాడ‌ని.. అత‌డి ఎక్స్ ప్రెష‌న్ చూడాల‌నుంద‌``ని ఆర్జీవీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

ట్రంప్ భార‌త్ కి రావ‌డానికి కార‌ణాల్ని ప్ర‌స్థావిస్తూ.. అత‌డు ఇక్క‌డికి ఎందుకు వ‌స్తాడంటే త‌న‌ని ఎంత మంది చూడటానికి వస్తారో చూసేందుకేన‌ని.. ఆయన చనిపోయే వరకు గొప్పగా చెప్పుకోవచ్చ‌నే ఉద్ధేశంతోనే ఈ ప‌ర్య‌ట‌న సాగుతోంద‌ని ఆర్జీవీ తెలిపాడు. తన కోసం 10 మిలియన్ల మంది రావచ్చు.. కానీ ట్రంప్‌ 15 మిలియన్ల జనాలు వచ్చారని అబద్ధం చెబుతాడు అంటూ వ‌రుస ట్వీట్ ల‌తో ఆర్జీవీ పంచ్ లు వేసాడు. ``ఏ భారతీయుడైన తమ సొంత సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తారని నేను అనుకోవడం లేదు. అలాంటిది వేరే దేశం నుంచి వచ్చిన వాళ్లు ఆసక్తిగా చూస్తారని ఆశించడం సరైనది కాదు. దీని కంటే ఓ బాలీవుడ్‌ నైట్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేయడం ఉత్తమం`` అంటూ ట్రంప్ పై సెటైర్లు వేశాడు ఆర్జీవీ.