Begin typing your search above and press return to search.

RRR ఒక 'గే లవ్ స్టోరీ'.. ఆస్కార్ విన్నర్ రసూల్ సంచలన వ్యాఖ్యలు..!

By:  Tupaki Desk   |   4 July 2022 11:10 AM GMT
RRR ఒక గే లవ్ స్టోరీ.. ఆస్కార్ విన్నర్ రసూల్ సంచలన వ్యాఖ్యలు..!
X
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ.. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించిన ఈ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో భారతీయ సినిమాగా నిలిచింది. అయితే కొందరు ఈ చిత్రాన్ని గే సినిమాగా పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ఆస్కార్ విన్నింగ్ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి RRR అనేది ఒక 'గే లవ్ స్టోరీ' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలియా భట్‌ ను ఒక ప్రాప్ గా ఉపయోగించుకున్నారని అన్నారు. 'నిన్న రాత్రి RRR అనే చెత్త సినిమాను 30 నిమిషాలపాటు చూశాను' అని మునిష్ భరద్వాజ్ అనే బాలీవుడ్ దర్శకుడు ట్వీట్ చేసాడు. దీనికి రసూల్ స్పందిస్తూ పైవిధంగా కామెంట్ చేశారు.

RRR సినిమా రసూల్ పోకుట్టి వ్యాఖ్యపై సినీ అభిమానులు మండిపడుతున్నారు. భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన చిత్రంపై ఒక ఇండియన్ సౌండ్ ఇంజినీర్ ఇలాంటి కామెంట్స్ చేస్తారని అనుకోలేదని విమర్శిస్తున్నారు. తెలుగు సినిమాకు పేరు రావడాన్ని జీర్ణించుకోలేక అసూయతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.

రసూల్ అలాంటి సినిమాలు ఎక్కువగా చూడటం వల్ల ఏ మూవీ చూసినా అలానే అనిపిస్తుందేమో అని ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాపై చేసిన కామెంట్స్ తో మీపై రెస్పెక్ట్ పోయిందని ఓ నెటీజన్ ట్వీట్ చేయగా.. 'వెస్ట్రన్ దేశాల్లో ఆ చిత్రాన్ని అలానే పిలుస్తున్నారు. నేను దానిని కోట్ చేసాను' అని రసూల్ పోకుట్టి సమాధానమిచ్చాడు.

1920స్ బ్యాక్ డ్రాప్ లో విప్లవకారులు అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రూపొందించారు. ఇద్దరు హీరోల మధ్య స్నేహాన్ని.. వైరాన్ని మరియు బ్రోమాన్స్ ని ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారు దర్శకుడు రాజమౌళి.

అయితే RRR ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత వెస్ట్రన్ సినీ ప్రియులు మాత్రం అదొక గే సినిమా అని పోస్టులు పెట్టారు. రెండు మేల్ పాత్రల మధ్య కెమిస్ట్రీని ఎంతగానో ఆస్వాదించామని.. ఈ సినిమా స్వలింగసంపర్కుల మధ్య బంధాన్ని చక్కగా వివరించిందని ట్రోల్స్ చేశారు. ఇప్పుడు వీరి సరసన ఆస్కార్ విన్నర్ రసూప్ కూడా జాయిన్ అయ్యారు.

నిజానికి ఓటీటీలో స్ట్రీమింగ్ తర్వాత 'ఆర్.ఆర్.ఆర్' సినిమాకు గ్లోబల్ రీచ్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల దృష్టిని ఆకర్షిస్తోంది. అనేక మంది ప్రముఖ హాలీవుడ్ దర్శకులు మరియు సాంకేతిక నిపుణుల ఈ చిత్రం పై ప్రశంసలు కురిపించారు. అయితే భారతీయ సౌండ్ ఇంజినీర్ కు మాత్రం ఇదొక గే లవ్ స్టొరీగా పేర్కొంటున్నారు.

రసూల్ పోకుట్టి 'బ్లాక్' 'సావరియా' 'ఎంథిరన్' 'రా.వన్' వంటి చిత్రాలకు పని చేశాడు. తెలుగులో 'పుష్ప: ది రైజ్' మరియు 'రాధేశ్యామ్' వంటి పాన్ ఇండియా చిత్రాలకు సౌండ్ డిజైనింగ్ చేసాడు. 2009లో 'స్లమ్‌ డాగ్ మిలియనీర్‌' చిత్రానికి గాను బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు.