హీరోయిన్ గా అందుకే చేయలేదంటున్న ప్రముఖ గాయని..!

Sun Jan 24 2021 00:08:25 GMT+0530 (IST)

Respected Singer Sunithta Garu

ప్రముఖ గాయని సునీత ఇటీవల రెండో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. కొన్నేళ్ళుగా ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత.. మ్యాంగో రామ్ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించింది. హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న సింగర్ సునీత.. తన గాత్రంతో శ్రోతలను అలరిస్తూ వస్తోంది. ఆమె ఆకర్షణీయమైన రూపం కూడా ఇంతటి ఫాలోయింగ్ కి కారణమని చెప్పవచ్చు. అందమైన రూపం గల సింగర్ సునీతని హీరోయిన్ గా చేయమని చాలా మంది దర్శక నిర్మాతలు అడిగారట. అయితే ఆ ఆఫర్స్ ని సున్నితంగా తిరస్కరించానని ఇటీవల ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత వెల్లడించింది.గాయనిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లోనే సునీతకు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చాడట. హీరోయిన్ గా మారితే కష్టాలు ఉంటాయని.. వాటిని దగ్గర నుంచి చూశానని.. అలాంటి జీవితం తనకు వద్దు అనుకుని ఆ అవకాశాన్ని సునీత సున్నితంగా తిరస్కరించారట. అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మ 'అనగనగా ఒక రోజు' సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తే కూడా నో చెప్పారట. మళ్లీ ఇప్పుడు ఛాన్స్ వస్తే నటిస్తారా అనే ప్రశ్నకు సునీత సమాధానం చెప్తూ.. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అనవసరంగా మార్చడం ఎందుకు.. ఇప్పుడంతా బాగానే ఉంది కదా అని చెప్పారు. అయితే సునీత సమాధానంతో హీరోయిన్ కావడం అంటే ప్రశాంతతను కోల్పోవడమేనా అంటూ నెటిజన్స్ ఆమెను ప్రశ్నిస్తున్నారు.