చీరలో సుందరి సొగసులు చూస్తే కుర్రగుండెలు మాయమే!

Sat Jun 06 2020 07:00:02 GMT+0530 (IST)

Attracting with saree

రేష్మ పసుపులేటి.. తెలుగు అమ్మాయే కానీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. ఈ ముప్పై రెండేళ్ల సుందరి పుట్టింది తెలుగు ఫ్యామిలీలో అయినా నటించింది మాత్రం తమిళ మలయాళం సినిమాలలోనే. ఎక్కువగా తమిళంలో మెరిసింది ఈ బ్యూటీ. తెలుగు సినీ నిర్మాత పసుపులేటి ప్రసాద్ కూతురే. రేష్మ తన విద్యాభ్యాసం అంతా అమెరికాలో సాగించింది. అమెరికాలోని 'టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ' నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తిచేసింది. చదువు పూర్తయిన తర్వాత అమ్మడు డెల్టా ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా కొంతకాలం ఉద్యోగం చేసింది. ఆ తర్వాత ఇండియాకి తిరిగివచ్చి ఇక్కడే ఉంటోంది. ఇక ఇండియాకి రాగానే టీవీ5 లో ఇంగ్లీష్ న్యూస్ యాంకర్ గా పనిచేసింది. అలా న్యూస్ రీడర్ గా ఉండగా రేష్మకి టెలివిజన్ సిరీస్ నుండి నటిగా ఆఫర్లు వచ్చాయట. అలా వంశం అనే తమిళ సిరీస్ లో స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణతో కలిసి నటించి మంచి పాపులారిటీ సాధించింది.ఆ తర్వాత అమ్మడికి తమిళ సినిమాల నుండి ఆఫర్లు రావడం మొదలయ్యింది. అంతే.. 2015లో విడుదలైన 'మసాలా పడం' అనే సినిమాతో హీరోయిన్ గా వెండితెర పై అరంగేట్రం చేసింది. ఆ సినిమా తరవాత కో2 వెలయును వందట్ట వెళ్ళైకారణ సినిమాలలో మెరిసింది. ఇక 2016లో గర్ల్స్ అనే సినిమాతో మలయాళంలో కూడా అడుగుపెట్టింది ఈ తెలుగు ముద్దుగుమ్మ. ఇక 2019లో కోలీవుడ్ బిగ్ బాస్-3లో కంటెస్టెంట్ గా పాల్గొని టీవీ ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. అయితే అమ్మడికి టీవీ యాంకర్ గా కూడా చేసిన అనుభవం ఉంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది రేష్మ. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూస్తే ఖచ్చితంగా కుర్రకారుకి తెలుగందం ఇంతకాలం ఎందుకు కనిపించలేదు అని ఫీల్ అవుతారు. అలా ఉంది మరి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో చీర కట్టుకొని సింగారించుకున్న రేష్మీని చూస్తే కళ్లప్పగించి చూడాల్సిందే. చీరలో ఆ సొగసులు మనసు దోచేస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగందం తెలుగులో మాత్రం ఎందుకు కనిపించడం లేదో తెలియట్లేదని అంటున్నారు.