Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: న‌వ్వులు చిందిస్తున్న‌ ఆర‌డుగుల బుల్లెట్టు

By:  Tupaki Desk   |   8 Jun 2021 8:30 PM GMT
ఫోటో స్టోరి: న‌వ్వులు చిందిస్తున్న‌ ఆర‌డుగుల బుల్లెట్టు
X
ఆర‌డుగుల బుల్లెట్టు..!! అంటూ శ్రీ‌మ‌ణి యాధృచ్ఛికంగానే ప‌వ‌న్ క‌ల్యాణ్ ని ఉద్ధేశించి లిరిక్ రాసినా కానీ.. ఇప్పుడు జూనియ‌ర్ ప‌వ‌న్ గా పాపుల‌రైన అకీరానంద‌న్ ని వ‌ర్ణించాలంటే మాత్రం అత‌డు ప‌దాలు స‌వ‌రించాల్సిందే.

టాలీవుడ్ లోనే ట‌వ‌ర్ రేంజులో ఎత్తున్న‌ హీరోగా అకీరా నంద‌న్ పేరు మార్మోగడం ఖాయం. వ‌రుణ్ తేజ్ - రానా - ప్ర‌భాస్ రేంజును అత‌డు మించిపోతున్నాడు. అకీరా నంద‌న్ సినీ ఆరంగేట్రం ఎప్పుడు ఉంటుంది? అన్న‌దానిపై స‌రైన క్లారిటీ రాలేదు. అడివి శేష్ `మేజ‌ర్`లో అతడి ఆరంగేట్రం ఉంటుంద‌ని ప్ర‌చార‌మ‌వుతున్నా అందులో నిజం ఎంతో తెలీదు. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లులోనూ అవ‌కాశం ఉందో లేదో చూడాలి.

ప్ర‌స్తుతానికి అత‌డు స్టడీస్ ని పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. మామ్ రేణుదేశాయ్ తో క‌లిసి అత‌డు న‌వ్వులు చిందిస్తూ ఉన్న ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఆ ఇద్ద‌రి మోములో ఎంతో ప్లెజెంట్ లుక్ క‌నిపిస్తోంది. డాడ్ ప‌వ‌న్ లానే అకీరా కూడా చాలా సింపుల్ గా క‌నిపిస్తున్నాడు ఈ ఫోటోలో.