Begin typing your search above and press return to search.

అర్థరాత్రి వేళ.. ఆ ఇంట్లో నిద్ర పోయిన రేణూదేశాయ్

By:  Tupaki Desk   |   19 Jan 2020 7:45 AM GMT
అర్థరాత్రి వేళ.. ఆ ఇంట్లో నిద్ర పోయిన రేణూదేశాయ్
X
కోట్లాది మంది కలవాలనుకునే కొందరు ప్రముఖుల్లో ఒకరు పవన్ మాజీ సతీమణి రేణుదేశాయ్. దాంపత్య జీవితంలో వచ్చచిన విభేదాలతో కానీ మరే ఇతర కారణాలతో కానీ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. తన మాజీ భార్య రేణు గురించి పవన్ ఒక్క మాట మాట్లాడరు. ఆ మాటకు వస్తే.. రేణునే అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. సోషల్ మీడియాలో తన భావోద్వేగాల్ని ఎప్పటికప్పుడు తెలియజేసే ఆమె కొన్నిసార్లు పవన్ అభిమానుల నుంచి వచ్చే రియాక్షన్లపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.

అలా అని.. అందరికి దూరంగా తన మానాన తాను ఉండాలనుకోరు. నిజానికి అలాంటి ఆలోచన కూడా తప్పే. ఎవరో ఏదో అంటారని.. మనం మనకు నచ్చిన పనులు చేయకూడదని పరిమితులు విధించుకోవటం ఏ మాత్రం సబబు కాదు. ఇంతకీ రేణు ప్రస్తావన ఇప్పుడు రావటానికి కారణం.. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుగా చెప్పాలి.

షూటింగ్ కి వెళ్లి హైదరాబాద్ కు తిరిగి వస్తున్న వేళ.. ఆమెకు అనుకోని అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు ఆ గ్రామాన్ని దాటితే హైదరాబాద్ నగరంలోకి అడుగు పెట్టే వేళ.. ఊళ్లోకి వెళ్లాలని రేణు అనుకోలేదట. అదే విషయాన్ని తన అసిస్టెంట్ కు చెబుతున్నప్పుడే.. రేణు మనసులోని మాటను దేవుడు విన్నట్లున్నాడు. అప్పటి వరకూ సజావుగా సాగుతున్న ప్రయాణానికి బ్రేకులు వేస్తూ.. కారుకు పంక్చర్ అయ్యింది. కారు దిగిన ఆమె పరిసరాల్ని చూసుకొని తెగ సంతోష పడిపోయిందట. దీనికి కారణం.. కాంక్రీట్ జంగిల్ కు భిన్నంగా మట్టి వాసనలు.. వాటితో మమేకమయ్యే మట్టి మనుషుల బతుకులు చూసి ఆమె సంతోషానికి గురయ్యారు.

ఆ రాత్రి వేళ అక్కడి గ్రామస్థుల్ని కలిసిన ఆమె.. వారితోనే గడిపారట. అంతేనా.. రేణు వచ్చిందని సంబరపడిన ఆ గ్రామస్థులు తమకు ఉన్నదాన్లోనే చూసుకొని ఉప్మా వండి పెట్టటమే కాదు టీ కాచి పెట్టారట. చలిమంట కూడా వేశారట. వారి వద్ద తినటానికి సరైన తిండి లేకున్నా.. తమకున్న దాన్లో తనకు పెట్టే ప్రయత్నం చేశారని ఎమోషనల్ అయ్యారు. మన దగ్గర ఉన్నా.. ఎవరికైనా ఏమైనా ఇవ్వటానికి తెగ ఆలోచిస్తామని.. కానీ వారు మాత్రం తమకున్న కాస్తను ఇచ్చేయటానికి అస్సలు ఆలోచించలేదని చెప్పుకొచ్చారు. ఎంత డబ్బు ఉండి ఏం లాభం.. వారి నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉందని పేదల గొప్పతనాన్ని కీర్తించింది. అన్నింటికి మించి ఆ రాత్రి.. ఆ పేదింట్లోనే నిద్ర చేసిందట. ఈ విషయాన్ని ఇన్ స్టాలో పోస్టు చేసింది. రేణు.