అకీరా ఫేస్ బుక్ మెసేజీలు.. అసలు నిజం ఇదే!

Mon Apr 15 2019 14:12:09 GMT+0530 (IST)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.  అభిమానులు పవన్ కు సంబంధించిన విశేషాలే కాకుండా పవన్ పిల్లలకు సంబంధించినవాటిపై కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు.  పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ అకీరా నందన్.. ఆద్యలకు సంబంధించిన అప్డేట్స్ ను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంటుంది. రేణు ఎప్పుడు అలా అప్డేట్ షేర్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది.  తాజాగా రేణు దేశాయ్ అకీరా సోషల్ మీడియాఖాతాల విషయంపై ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.ఈమధ్య అకీరా నందన్ ఫేస్ బుక్.. ట్విట్టర్ లో ఖాతాలు ఓపెన్ చేశాడని.. సామజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడని ప్రచారం సాగుతోంది.  అకీరా పేరు మీద ఉన్న ఫేస్ బుక్ పేజికి రెండు లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.  ఈమధ్య పవన్ ఎన్నికల ప్రచారంలో అనారోగ్యానికి గురైతే అకీరా పోస్టులు పెట్టాడని కూడా ప్రచారం సాగింది.   ఈ విషయంపై స్పందించిన రేణు ఇంతవరకూ అకీరా ఎటువంటి సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.  అకీరా పేరు మీద ఉన్న ఖాతాలన్నీ అభిమానులు ఓపెన్ చేసినవేనని తెలిపింది.

అకీరా గురించి తనకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతోమంది మెసేజులు పెడుతూ ఉంటారని.. పవన్ వారసుడిగా అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుతూ ఉంటారని రేణు తెలిపారు.  కానీ అకీరా ఇంకా చిన్నవాడేనని చెప్పారు రేణు.