Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న రేణుదేశాయ్ పోస్ట్.. స్త్రీవాదం పై రచ్చ!!

By:  Tupaki Desk   |   11 Aug 2020 12:32 PM GMT
వైరల్ అవుతున్న రేణుదేశాయ్ పోస్ట్.. స్త్రీవాదం పై రచ్చ!!
X
ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలు తమ అభిమానులకు సులభంగా దగ్గరవుతున్నారు. లాక్‌డౌన్ పరిస్థితుల్లో సోషల్ మీడియానే దిక్కని భావిస్తున్న సెలబ్రిటీలు మాట్లాడుతూ.. అనేక విషయాలను పంచుకుంటున్నారు. ఇదివరకే లాక్‌డౌన్ లో ఉన్న రేణుదేశాయ్ తన అభిమానులతో లైవ్ లో లవ్, బ్రేకప్.. లాంటి ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబిచ్చింది. లవ్ అనేది చాలా కాంప్లికేటేడ్. దానిలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. లవ్ బ్రేకప్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో కారణంతో అవుతుందని తెలిపిన రేణు.. నేడు సమాజంలో స్త్రీవాదం.. వారి వ్యక్తిత్వం అనే అంశాల పై పోస్ట్ పెట్టి.. తన గురించి అనేక విషయాలను పోస్ట్ రూపంలో బయట పెట్టింది. "ప్రస్తుతం ఈ సమాజం దృష్టిలో నేనొక ఒంటరి మహిళ. అలాగే సింగిల్ పేరెంట్‌. ఇక అందరిలాంటి ఆడదాన్ని కాదు. మగవారు అనుకున్నట్లుగా.. నా నిబంధనల పై నేను జీవించే స్త్రీని. భర్త నుండి ఎలాంటి సహాయం లేకుండా పిల్లలను సంపూర్ణంగా పోషించే తల్లిని.

నా కాళ్లపై నేను నిలబడి, వ్యాపారం చేసుకుని, ఆర్థికంగా నిలబడగలిగే మహిళను. అలాగే అన్యాయాలను గట్టిగా ఎదిరించగలను. సమాజంలోని పితృస్వామ్య వ్యవస్థకు వత్తాసు పలికని స్త్రీని. కానీ ఇవ్వన్నీ ఎలాంటి కారణాలు లేకుండా నాపై ఏర్పడిన అభిప్రాయాలు. అయితే స్వతంత్ర్య ఆలోచనలతో బ్రతకాలని, అలాగే నన్ను అనుసరించే ఆడపిల్లలకు చెప్పేది ఒక్కటే. మీకంటూ ఓ ప్రత్యేక దారి ఏర్పరచుకుంటే మంచిది. వేరొకరి కూతురుగా లేదా భార్యగా ఉండటం అసలైన గుర్తింపు కాదు. మీ లైఫ్‌లో మీరే ప్రత్యేకమైన వ్యక్తి. అలాగని సాంప్రదాయ విలువలను అగౌరవ పరచకూడదు. కుటుంబ సంప్రదాయాల ముసుగులో శతాబ్దాలుగా జరుగుతున్న అన్యాయానికి అండగా నిలబడటమే స్త్రీవాదం. స్త్రీలు ఇకనైనా మీ మీ బలాలు, వ్యక్తిగత సామర్థ్యాలను నమ్మడం ప్రారంభించండి. దుర్గాదేవీ, లక్ష్మీ, సరస్వతిలా ఉండాలి. ఆ ముగ్గురిలో ఉన్న లక్షణాలను అలవర్చుకోండి. మీకంటూ ఓ ప్రత్యేక జీవితం ఉంది. దానిని సమర్థవంతంగా అనుభవించండి'' అని రేణుదేశాయ్ పోస్ట్ ద్వారా తెలిపింది. అయితే ఈ పోస్ట్ కు నెట్టింట పాజిటివ్ స్పందన వస్తూనే ఆమెను స్ఫూర్తి కలిగేలా చెప్పారని పొగిడేస్తున్నారు.