పవన్ కళ్యాణ్.. ఒక్క రోజుకు 2కోట్లు?

Wed Jun 29 2022 08:00:01 GMT+0530 (IST)

Remuniration Of Pawankalyan

తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ఒకే తరహా స్టార్ ఇమేజ్ ను కొనసాగిస్తున్న ఏకైక నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక హీరోతో సినిమా చేస్తున్నారు అంటే తప్పకుండా అతని మార్కెట్ను దృష్టిలో ఉంచుకొనే నిర్మాత పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతాడు. ఇక పవన్ కళ్యాణ్ కు అంత మార్కెట్ లేకపోతే అతని సినిమాలు అంతగా లాభాలు అంధించకపోతే ఎవరు కూడా ప్రోడ్యూస్ చేయడానికి. ముందుకు రారు.ఇక పవన్ కెరీర్ లో ఎన్ని ఫ్లాప్స్ ఉన్నా కూడా అందులో చాలావరకు సినిమాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నవే. ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే కాస్త క్లిక్ అయినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలు వస్తాయని నిర్మాతలు ఆశ పడుతూ ఉంటారు. మంచి కంటెంట్ తోనే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు పారితోషికం ఎంత అడిగిన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే ఒక్కో సినిమాకు  50 కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నట్లుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

అయితే పవన్ కళ్యాణ్ త్వరలో స్టార్ట్ చేయబోయే ఒక సినిమాకు మాత్రం ఒక రోజుకు దాదాపు రెండు కోట్ల ఆదాయాన్ని అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న వినోదయ సీతం రీమేక్ అని తెలుస్తోంది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నట్లు ఇటీవల అనేక రకాల వార్తలు వస్తున్నాయి.

కానీ అఫీషియల్గా ఎవరు కూడా ఆ ప్రాజెక్టు పై క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే నిర్మాణ సంస్థ సీతారా ఎంటర్టైన్మెంట్స్ మాత్రం పవన్ కళ్యాన్ కు దాదాపు 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా కోసం కేవలం 30 రోజులు షెడ్యూల్ లో మాత్రమే పాల్గొంటారట. అంటే రోజుకు పవన్ కళ్యాణ్ కు రెండు కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్లు లెక్క. ఒక విధంగా పాన్ ఇండియా హీరోలకు ఏ మాత్రం తక్కువ కాకుండా పవన్ ఇలాంటి రెండు మూడు సినిమాలు చేసిన ఒక ఏడాదిలో  వారికంటే ఎక్కువ స్థాయిలోనే ఆదాయాన్ని అందుకుంటాడు  అని చెప్పవచ్చు.