వైరల్ వీడియో : కొమురం భీమ్ డైరీ మిల్క్ చాక్లెట్ సాంగ్

Sun Sep 25 2022 20:33:53 GMT+0530 (India Standard Time)

Remixed Version Of NTR Komaram Bheemudo Shaking Social Media

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా నెలలు గడుస్తున్నా కూడా సందడి మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. కొమురం భీమ్ మరియు అల్లూరి పాత్రల్లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లను జక్కన్న చూపించిన తీరుకు కేవలం తెలుగు ప్రేక్షకులు.. ఇండియన్ ప్రేక్షకులు అని కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు కూడా ఫిదా అవుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా సినిమాకు మంచి పాపులారిటీ దక్కింది. ఆస్కార్ నామినేషన్స్ ను కూడా దక్కించుకుంటుందని అభిమానులు చాలా బలంగా నమ్మారు. కానీ ఏదో రాజకీయం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే ఆర్ ఆర్ ఆర్ కాన్సెప్ట్ తో ఏ వీడియో చేసిన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వకుండా ఉండదు.

ఒక ఏడాది వయసు ఉన్న బుడ్డోడిని కొమురం భీమ్ ను కట్టేసినట్లుగా కట్టేసి.. మొహం మరియు బాడీ పై రక్తం మాదిరిగా కలర్ అంటిస్తే ఆ వీడియో ఎంతటి వైరల్ అయ్యిందో అందరికి తెల్సిందే. ఇప్పుడు డైరెక్ట్ ఎన్టీఆర్ డైరీ మిల్క్ చాక్లెట్ పాట పాడుతున్నట్లుగా.. అది కూడా కట్టేసి రామ్ చరణ్ కొడుతున్న సమయంలో అవ్వడం మరింత ఆసక్తికరంగా ఉంది.

డైరీ మిల్క్ యాడ్ లోని ఆడియోని తీసుకుని కిస్ మీ అంటూ ఎన్టీఆర్ పెదాలకు కాస్త అటు ఇటుగా సింక్ అయ్యే మాదిరిగా మ్యాచ్ చేసే ప్రయత్నం చేశారు. భలే సెట్ అయ్యిందంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఎవరో సరదాగా చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని కుదిపేస్తుంది. మీరు ఒక లుక్కేయండి.