రెజీనా గ్లామర్ ట్రీట్.. ఎన్నాళ్ళయినా అదే అందం!

Tue Jul 05 2022 13:09:47 GMT+0530 (IST)

Regina Glamour Treat

కొంతమంది నటి నటులు మంచి టాలెంట్ తో ఇండస్ట్రీలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నప్పటికి కూడా కొన్నిసార్లు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు అందుకోకపోవచ్చు. ఇక గత కొన్నేళ్లుగా మంచి నటనతో అలాగే విభిన్నమైన గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంటున్న రెజీనా కాసండ్ర కూడా ఇంతవరకు ఇండస్ట్రీ హిట్ సినిమాలలో నటించింది లేదు. అయినప్పటికీ కూడా ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం చాలానే వచ్చాయి. మీడియం రేంజ్ హీరోలతో ఏదో ఒక సినిమా చేస్తూ బాగానే బిజీ అవుతుంది.ఇక అప్పుడప్పుడు రెజీనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన మరొక ఫోటో కూడా ఫాలోవర్స్ ను ఎంతగానో కట్టుకుంటుంది.

చిన్న గౌనులో అమ్మాయి తన లెగ్స్ అందాలను అలాగే క్లివేజ్ అందాలను ఒకేసారి హైలెట్ చేసి మతి పోగొట్టేసింది. ఇక ఫోటోను చూసిన ఫాలోవర్స్ ఎన్నేళ్లయినా కూడా రెజీనా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు అని తన క్యూట్ స్మైల్ తోనే అమ్మడు ఎంతగానో ఆకట్టుకుంటుంది అని పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

ఇక రెజినా సినిమాల విషయానికి వస్తే ఈ బ్యూటీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుని చాలా కాలమైంది. ఆ మధ్య అడవి శేష్ ఎవరు సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా నటనతో కూడా ఎంతగానో అట్రాక్ట్ చేసింది. ఆమె నటనపై విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. దీంతో గత ఏడాది ఆమె వరుసగా ఏడు సినిమాలు కూడా చేసింది.

కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా కొన్ని పెద్ద సినిమాల్లో అవసరమైన పాత్రలు కూడా చేసింది. తలైవి సినిమాలో సరోజా దేవి పాత్ర చేసి బాగానే ఆకట్టుకుంది. ఇక  ఇక ఈ ఏడాది రెజీనా నుంచి పెద్దగా సినిమాలు ఏమీ రాలేదు.

ఆచార్య సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ మాత్రమే చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో 7 సినిమాలు చేస్తోంది. అలాగే తెలుగులో షాకిని డాకిని అనే ఒక హారర్ సినిమాలో నటిస్తోంది.