Begin typing your search above and press return to search.

అందరిలాగే బోల్డ్‌ ఆఫర్ ఇచ్చేసిన హాట్‌ బ్యూటీ

By:  Tupaki Desk   |   24 Feb 2021 2:30 AM GMT
అందరిలాగే బోల్డ్‌ ఆఫర్ ఇచ్చేసిన హాట్‌ బ్యూటీ
X
హీరోయిన్ గా ఆఫర్లు రాని సమయంలో ఐటెం సాంగ్స్ కు ఓకే చెప్పడం ముద్దుగుమ్మలు సర్వ సాదారణంగా చేసే పని. కొందరు ముద్దుగుమ్మలు హీరోయిన్‌ గా ఆఫర్ల కోసం బోల్డ్‌ పాత్రలు చేసేందుకు హాట్ సీన్స్‌ చేసేందుకు ఓకే చెబుతున్నారు. ముద్దుగుమ్మలు ఎంతో మంది హీరోయిన్‌ గా ఛాన్స్ లు రాని సమయంలో బోల్డ్‌ గా నటించేందుకు ముందుకు వస్తూ ఉంటారు. ఇప్పుడు రెజీనా కూడా బోల్డ్‌ గా నటించేందుకు విలన్ పాత్రలు చేసేందుకు సిద్దం అంటూ ప్రకటించింది. హీరోయిన్‌ గా ఈమె చేసిన సినిమాలు కొన్ని సక్సెస్ అయినా కూడా గుర్తింపు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కనిపించేందుకు సిద్దం అయ్యింది. తాజాగా ఈమె చక్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చక్ర సినిమాలో రెజీనా పాత్రకు మంచి స్పందన వచ్చింది. ప్రతి నాయిక పాత్ర లాలా పాత్రలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా కథ ను దర్శకుడు రెండు సార్లు చెప్పారు. సినిమాటోగ్రాఫర్ బాల సుబ్రమణ్యన్ ఫోన్‌ చేసి కూడా మీరు ఆ ప్రతినాయిక పాత్ర చేస్తే తప్పకుండా మంచి పేరు వస్తుందన్నారు. అందుకే ఆ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నాను. తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్నాను. కథ నచ్చితే హీరోయిన్‌ గా విలన్ గా మాత్రమే కాకుండా ఎలాగైనా నటించేందుకు సిద్దం అన్నట్లుగా రెజీనా చెప్పుకొచ్చింది. బోల్డ్‌ పాత్రలు సినిమాకు కీలకం అన్నప్పుడు తాను నటించేందుకు అస్సలు వెనుకాడను అంటూ క్లారిటీగా చెప్పేసింది. మొత్తానికి రెజీనా హీరోయిన్‌ గానే కాకుండా ఎలాగైనా నటిస్తానంటూ మేకర్స్‌ కు ఆఫర్‌ ఇచ్చింది. మరి ఈ అమ్మడి ఆఫర్‌ ను ఇండస్ట్రీ వర్గాల వారు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.