రీ షెడ్యూల్ ఫిక్స్.. ముద్దుగుమ్మల ఫైట్

Tue Jun 22 2021 19:00:01 GMT+0530 (IST)

Regina Cassandra And Nivetha Thomas As Shakini Dhankini

కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ ను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుధీర్ వర్మ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు శాకినీ - ఢాకినీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి ఇదే ఏడాదిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా ఇటీవల సుధీర్ వర్మ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా షూటింగ్ రీ షెడ్యూల్ ఖరారు అయ్యింది. కరోనా కారణంగా నిలిచి పోయిన ఈ సినిమా షూటింగ్ ను జులై 4 ను పునః ప్రారంభించబోతున్నారు.ఈ సినిమా షూటింగ్ ను యాక్షన్ సన్నివేశాలతో షురూ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. డైరెక్ట్ గా యాక్షన్ సన్నివేశాలకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. రెజీనా మరియు నివేథా థామస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా లో యాక్షన్ సన్నివేశాలు స్టార్ హీరోల సినిమాల్లో ఉన్నట్లుగా భారీ ఎత్తున ఉంటాయని అంటున్నారు. ఇంటర్వెల్ కు ముందు వచ్చే యాక్షన్ సన్నివేశం సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.

రెజీనా మరియు నివేథా థామస్ ల మద్య వచ్చే యాక్షన్ సన్నివేశం సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని.. ఇద్దరు హీరోయిన్స్ హీరోల రేంజ్ లో పోరాడబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వీరికి ఈ సినిమా చాలా కీలకంగా మారింది. మరి ఈ సినిమా వారికి సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.