Begin typing your search above and press return to search.

రికార్డ్ క్రియేట్ చేసిన‌ విజ‌య్ దేవ‌ర‌కొండ

By:  Tupaki Desk   |   19 Jan 2022 4:31 PM GMT
రికార్డ్ క్రియేట్ చేసిన‌ విజ‌య్ దేవ‌ర‌కొండ
X
రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయ‌న హీరోగా గ‌త రెండేళ్ల క్రితం విడుద‌లైన సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ ఘ‌న‌త‌ని సాధించ‌డం విశేషం. వివ‌రాల్లోకి వెళితే... విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం `డియర్ కామ్రేడ్‌`. 2019లో భ‌ర‌త్ క‌మ్మ డైరెక్ష‌న్ లో రూపొందిన ఈ మూవీ మ‌హిళా సాధికార‌త నేప‌థ్యంలో తెర‌కెక్కి సంచ‌ల‌నం సృష్టించింది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రం హిందీ వెర్ష‌న్ అరుదైన ఘ‌న‌త‌ని సాధించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే డ‌బ్బింగ్ చిత్రానికి రానంత‌గా 3.5 మిలియ‌న్ లైక్స్ `డియర్ కామ్రేడ్` హిందీ వెర్ష‌న్ కి ద‌క్కాయి. దీంతో డ‌బ్బింగ్ చిత్రాల్లో `డియ‌ర్ కామ్రేడ్` స‌రికొత్త రికార్డుని సృష్టించింది. అంతే కాకుండా యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన రెండేళ్ల‌లో 300 మిలియ‌న్ పై చిలుకు వ్యూస్ క్రాస్ చేసింది. మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్‌బెన్ సినిమాస్ నిర్మించిన ఈ మూవీ భావోద్వేగా ప్రేమ‌క‌థ‌గా ఆక‌ట్టుకుంది.

అంతే కాకుండా లిల్లీ గా ర‌ష్మిక న‌టించిన తీరు, క్రికెట‌ర్ గా ఈ పాత్ర కోసం త‌ను చేసిన హోమ్ వ‌ర్క్ సినిమాని టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మార్చాయి. ఇందులో అత‌గా ఆవేశ‌ప‌డే బాబి పాత్ర‌లో స్టూడెంట్ లీడ‌ర్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ ఆక‌ట్టుకున్నారు. గత చిత్రాల‌తో పోలిస్తే త‌న మేకోవ‌ర్ కూడా చా మెచ్చూర్ గా క‌నిపించింది. ఇందులో హీరో విజ‌యే అయినా క‌థ మొత్తం ర‌ష్మిక చుట్టూ తిర‌గ‌డం విశేషం. దీంతో ర‌ష్మిక ఈ పాత్ర‌లో న‌టించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది.

`అర్జున్ రెడ్డి` త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో మంచి ఇమేజ్ ని తీసుకొచ్చింది. తెలుగుతో పాటు ఈ మూవీని త‌మిళ‌, తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేశారు. ఈ మూవీ కోసం ఆయా భాష‌ల‌ల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అండ్ టీమ్ బాగా ప్ర‌చారం చేసింది.

ఈ మూవీ హిందీ వెర్ష‌న్ ని గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానెల్ అధికారికంగా 2020 జ‌న‌వ‌రి 19న అప్ లోడ్ చేసింది. అప్ప‌టి నుంచి ఈ మూవీ మిలియ‌న్ ల కొద్దీ వ్యూస్ ని రాబ‌డుతూ తాజాగా 30 కోట్ల‌కు మించి వ్యూస్ ని దాటేసి సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే డ‌బ్బింగ్ చిత్రానికి రానంత‌గా 3.5 మిలియ‌న్ లైక్స్ `డియర్ కామ్రేడ్` హిందీ వెర్ష‌న్ కి ద‌క్కాయి. దీంతో డ‌బ్బింగ్ చిత్రాల్లో `డియ‌ర్ కామ్రేడ్` స‌రికొత్త రికార్డుని సృష్టించింది.