జ్యోతిక సూర్య.. చాలా కాలం తరువాత ఇలా..

Thu Jun 23 2022 17:00:01 GMT+0530 (IST)

Recently, Jyothika Surya Had A Holiday Trip Together

కోలీవుడ్ సినిమా వరల్డ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో బెస్ట్ కపుల్స్ గా గుర్తింపు అందుకున్న వారిలో సూర్య జ్యోతిక జంట టాప్ లిస్టులో ఉంటుంది అనే చెప్పాలి. వీరిద్దరూ పెళ్లి చేసుకొని వారి రియల్ లైఫ్ ను ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో వారి ఫోటోలను చూస్తుంటునే అర్ధమవుతుంది.ఒకప్పుడు గ్లామరస్ పాత్రలు సైతం చేసినటువంటి జ్యోతిక సూర్యను పెళ్లి చేసుకున్న అనంతరం ఆ ప్రపంచాన్ని దూరంగా పెట్టేసి ఫ్యామిలీ లైఫ్ ను సరికొత్త గా స్టార్ట్ చేసింది.

ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన జ్యోతిక ఒకవైపు భార్యగా మరోవైపు తల్లిగా తన బాధ్యతను ఎంతో ఆప్యాయంగా కొనసాగిస్తోంది. అయితే ఫ్యామిలీ కోసం జ్యోతిక తను ఇష్టపడిన సినీ రంగాన్ని వదులుకోవడం సూర్యకు ఏ మాత్రం నచ్చలేదు.

ఇక వెంటనే ఆమెను మళ్ళీ సూర్య సినిమాల్లోకి వచ్చేలా చేశాడు. అయితే రొటీన్ కమర్షియల్ క్యారెక్టర్స్ కాకుండా విభిన్నమైన పాత్రల్లో నటించేందుకు జ్యోతిక ఎక్కువగా ఆసక్తిని చూపిస్తోంది. సూర్యతో పాటు ప్రస్తుతం జ్యోతిక చలాకీగా ఎప్పటిలానే సినిమా షూటింగ్స్ తో బిజీగా మారిపోయింది.

అయితే వీరు ఇద్దరు షూటింగ్స్ పనులతో బిజీగా గడపడం వలన మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ ను ఏ మాత్రం కాకుండా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు ప్రత్యేకంగా టూర్స్ వెళుతూ కాస్త సమయాన్ని గడుపుతున్నారు.

రీసెంట్ గా జ్యోతిక సూర్య ఇద్దరు కలిసి ఒక హాలిడే ట్రిప్ కు వెళ్లిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అందులో ఒక బ్రిడ్జిపై ఇద్దరు కలిసి దిగిన సెల్ఫీ ఫొటో కూడా చాలా బాగుంది. ఇక సినిమాల విషయానికి వస్తే జ్యోతిక ఒక రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉండగా మరోవైపు సూర్య ఇటీవల విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్ర చేసి ఆడియెన్స్ కు మంచి కిక్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం వాడి వాసల్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.