Begin typing your search above and press return to search.

పార్టీలు స‌రే.. ప్ర‌భాస్ కి పిల్ల‌ను వెతికారా?

By:  Tupaki Desk   |   20 Jan 2020 7:52 AM GMT
పార్టీలు స‌రే.. ప్ర‌భాస్ కి పిల్ల‌ను వెతికారా?
X
20 జ‌న‌వ‌రి .. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు బ‌ర్త్ డే.. ఈ సంద‌ర్భంగా సినీరాజ‌కీయ రంగాల నుంచి ప‌లువురు ప్ర‌ముఖులు.. రెబ‌ల్ ఫ్యాన్స్ ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. నేడు రెబ‌ల్ స్టార్ బ‌ర్త్ డే వేడుక‌లు మంచూస్ స‌మ‌క్షంలో వైభ‌వంగా జ‌రిగాయి. కృష్ణరాజు పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఇచ్చిన పార్టీలో మోహన్ బాబు- లక్ష్మి మంచు- విష్ణు మంచు త‌దితరులు పాల్గొన్నారు. ఈ పార్టీలో ప్రభాస్ నల్ల కుర్తా - తెల్ల ప్యాంటులో ప్లెజెంట్ గా కనిపిస్తున్నాడు. బ‌ర్త్ డే కేక్ చేస్తున్నప్పుడు మోహన్ బాబు.. ప్ర‌భాస్ ఇద్ద‌రూ కృష్ణరాజు పక్కన నిలబడి ఉన్నారు. లక్ష్మి మంచు ఈ బ‌ర్త్ డే వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. త‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పుట్టినరోజు పార్టీ నుండి కొన్ని ఫోటోలను అభిమానుల‌కు షేర్ చేశారు. ముఖ్యంగా ఆ ఫోటోల్లో ప్ర‌భాస్ తో క‌లిసి ఉన్న‌ప్ప‌టి ఫోటో హైలైట్ అనే చెప్పాలి.

కృష్ణరాజుకు మంచు కుటుంబ స‌భ్యులంతా ప్ర‌త్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ``ఎప్పటికీ యువ రెబల్ స్టార్ కృష్ణరాజు అంకుల్ ఇలానే మ‌రిన్ని పుట్టినరోజులు జ‌రుపుకోవాలి`` అంటూ ల‌క్ష్మీ మంచు సోష‌ల్ మీడియాలో విషెస్ తెలిపారు. హ్యాష్ ట్యాగ్ హ్యాపీ బ‌ర్త్ డే కృష్ణం రాజు అన్న ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్ లో ఉంది. రెబ‌ల్ స్టార్ అభిమానులు దీనిని టాప్ ట్రెండింగ్ కి తీసుకెళుతుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

కృష్ణరాజు తన కెరీర్ లో 183 కి పైగా సినిమాల్లో నటించారు. 1966 `చిలక గోరింకా` చిత్రంతో తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. కొటయ్య ప్రత్య‌గాత్మ ఈ చిత్రాన్ని స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు. అనంత‌రం రెబ‌ల్ స్టార్ కెరీర్ జ‌ర్నీ గురించి తెలిసిందే. కృష్ణం రాజు ప్ర‌స్తుతం భాజ‌పా నాయ‌కుడి గా ఉన్నారు. ఇక ప్ర‌భాస్ పెళ్లి చేయ‌డం ఒక్క‌టే ఆయ‌న బాధ్య‌త‌. గత సంవత్సరం ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ ర‌క‌ర‌కాల రూమ‌ర్ల‌ను మీడియా ముఖంగానే కొట్టి పారేశారు. సాహో చిత్రం విడుదలైన తర్వాత ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాన‌ని మాటిచ్చార‌ని ఆయ‌న తెలిపారు. మ‌రి ఆ బాధ్య‌త‌ను నెర‌వేర్చే స‌మ‌యం వ‌చ్చేసినా ఇంకా దానికి సంబంధించిన అప్ డేట్ ని కృష్ణం రాజు చెప్ప‌నేలేదు. మ‌రోవైపు ప్ర‌భాస్.. కెకె రాధా కృష్ణ కుమార్ తో కలిసి తన తదుపరి చిత్రం జాన్ షూటింగ్ ను తిరిగి ప్రారంభించాడు. జాన్ సెట్స్ నుంచి తొలి ఫోటోని ప్ర‌భాస్ అభిమానుల‌కు సోష‌ల్ మీడియాల ద్వారా షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే.