'పక్కా కమర్షియల్' కు క్రేజ్ ఏర్పడటానికి కారణాలివే..!

Thu Jun 30 2022 17:00:01 GMT+0530 (IST)

Reasons for the craze for 'Pakka Commercial'..!

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ మరియు గార్జియస్ బ్యూటీ రాశీ ఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం ''పక్కా కమర్షియల్''. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. రేపు (జులై 1) శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.'పక్కా కమర్షియల్' సినిమాకి క్రేజ్ బాగానే ఉంది. డిఫరెంట్ స్టైల్ లో దూకుడుగా ప్రమోషన్స్ చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. దీనికి తగ్గట్టుగానే పాటలు మరియు ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. లేటెస్టుగా వచ్చిన పవర్ ప్యాక్డ్ రిలీజ్ ట్రైలర్ యూట్యూబ్ లో ఇప్పటికే మిలియన్ మార్క్ వ్యూస్ రాబట్టింది.

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. 'భలే భలే మగాడివోయ్' 'టాక్సీవాలా' 'ప్రతి రోజు పండగే' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ఈ బ్యానర్లు కలిసి చేస్తున్న సినిమా ఇది.

విలక్షణ కథలతో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు నిర్మిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతోంది GA2 పిక్చర్స్. ఈ బ్యానర్ లో సినిమా పట్టాలెక్కిందంటే.. ఏదో విషయం లేకుండా ఉండదు అని ప్రేక్షకులు భావించే స్థాయికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 'పక్కా కమర్షియల్' సినిమాపై అందరి దృష్టి పడింది.

ఇటీవల కాలంలో గోపీచంద్ వరుస ఫ్లాప్లలో ఉన్నప్పటికీ 'పక్కా కమర్షియల్' సినిమాకు బజ్ రావడానికి కారణం.. ఇది గీతా ఆర్ట్స్2 నుండి వచ్చే సినిమా కావడమే. అలానే డైరెక్టర్ మారుతీ కామెడీ టైమింగ్ మీద కూడా జనాలకి మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఈ మూవీపై బజ్ క్రియేట్ అవడానికి కారణమయ్యాయి.

ఈరోజు గురువారం 'పక్కా కమర్షియల్' యూఎస్ఏ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. కామెడీ వర్కవుట్ అయితే లాంగ్ వీకెండ్ ని బాగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తక్కువ టికెట్ రేట్లతో రిలీజ్ అవుతుండటం ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అంశం. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి కమర్షియల్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

'పక్కా కమర్షియల్' సినిమాలో మారుతి మార్కు కామెడీ.. గోపీచంద్ తరహా యాక్షన్ ఉంటుందని ప్రమోషనల్ కంటెంట్ తోనే అర్థమైంది. ఇందులో గోపీచంద్ - రాశి ఖన్నా జంట అందంగా కనిపించింది. సత్యరాజ్ - రావు రమేశ్ - వరలక్ష్మి శరత్ కుమార్ - సప్తగిరి - శ్రీనివాస్ రెడ్డి - ప్రవీణ్ తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటించారు.

SKN సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించగా.. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఎన్ పి ఉద్భవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.