'ఎఫ్-3' ప్రమోషన్ కి తమన్నా అందుకే ఢుమ్మా?

Thu May 26 2022 09:53:22 GMT+0530 (IST)

Reasons Tamanna Absence of F3 Promotions

వారం రోజులుగా 'ఎఫ్ -3' టీమ్ అంతా ప్రచారంలో బిజీ అయిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  సహా మెహరీన్.. సోనాల్ చౌహాన్ అనీల్ రావిపూడి ఇలా సినిమాకి పని చేసిన కీలక సభ్యులంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ తమన్నా  జాడ మాత్రం ఎక్కడా కానరాలేదు. అందుకు కారణంగా లేకపోలేదు.అమ్మడు కొన్ని రోజులుగా కేన్స్ ఉత్సవాల్లో బిజీగా ఉండటంతోనే  వీలు పడలేదన్నది వాస్తవం. డైలీ రెడ్ కార్పెట్ పై డిజైనర్ దుస్తుల్లో మెరిపిస్తూ ప్రాన్స్ ఫ్యాషన్ ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. అయితే తమన్నా-పూజాహెగ్డే లా మధ్యలో రెడ్ కార్పెట్ వాక్ ని ముగించలేకపోయింది. పూజాహెగ్డే మొదటి మూడు   రోజులు రెడ్ కార్పెట్ పై మెరిసి అటుపై ఇండియాకి తిరుగు ప్రయాణం అయింది.

సినిమా షూట్స్ లో యాధావిధిగా పాల్గొంది. కానీ తమన్నా కి  మాత్రం  ఆస్కోప్ లేదు. దాదాపు కేన్స్ ముగింపు వరకూ అక్కడే  ఉండాల్సి వచ్చింది. దీంతో 'ఎఫ్ -3' ప్రమోషన్ కి  ఢుమ్మా కొట్టక తప్పలేదు. అందుకు ప్రత్యేక కారణం లేకపోలేదు. తమన్నా కేన్స్ ఉత్సవాలకు స్పాన్సర్ గాను వ్యవహరిస్తుంది. ప్రీమియం స్కాచ్ విస్కీ బ్రాండ్ సింగిల్టన్ ద్వారా కేన్స్ కి హాజరేంది.

దీంతో కేన్స్ లో  ఎక్కువ  రోజులు రెడ్ కార్పెట్  వాక్ చేసేలే అగ్రిమెంట్ చేసుకుంది. అందుకు గానూ  సదరు  బ్రాండ్ భారీగా పారితోషికం చెల్లించడంతో తమన్నా  కేన్స్ ఉత్సవాలకే  తొలి ప్రాధాన్యత ఇస్తుంది. సినిమాలు రెగ్యులర్ లైఫ్. కేన్స్ ఏడాదికి ఒకసారి జరిగే ఉత్సవం. అందుకే ఎఫ్-3 ప్రమోషన్ పక్కనబెట్టి కేన్స్ లో పాల్గొంది.

అయితే ఇంకా కేన్స్ ఉత్సవాలు రెండు రోజుల్లో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తమన్నా ఇండియాకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎఫ్ -3 రిలీజ్  కి ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. దీంతో  సినిమాకి సంబంధించి తమన్నా  ఏదైనా చేయగల్గితే ఈలోపే చేయాలి.  

ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే  'గుర్తుందా శీతాకాలంలో' హీరోయిన్ గా నటిస్తోంది.మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'భోళా శంకర్' లోనూ తమన్నాని తీసుకున్నారు. 'దటీజ్ మహాలక్ష్మి'  లో నటించింది. కానీ ఆ ప్రాజెక్ట్  రిలీజ్ కి నోచుకోలేదు. ఇక బాలీవుడ్ లో  'బోల్ చుడాయాన్'.. 'ప్లాన్ ఏ ప్లాన్ బి'..'బాబ్లీ బౌన్సర్' లో నటిస్తోంది.