ప్రియాంక బాలీవుడ్ వీడడానికి కారణమిదే..

Fri Aug 10 2018 11:52:50 GMT+0530 (IST)

ప్రియాంక చోప్రా.. ఈ బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఇప్పుడు హిందీలో నటించడమే మానేసింది. మొన్నీ మధ్యే సల్మాన్ ఖాన్ లాంటి అగ్రహీరో పక్కన అవకాశం వస్తే ఒప్పుకొని తర్వాత వదిలేసింది. ఇది బాలీవుడ్ లో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రియాంక ఎందుకిలా చేసిందో అర్థం కావడం లేదని చాలా మంది బాలీవుడ్ సినీ జనాలు ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు ప్రియాంక అలా తప్పుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉందని తెలిసింది.ప్రియాంక చోప్రా రెండు మూడేళ్లుగా బాలీవుడ్ కు దూరంగా అమెరికాలో ఉంటోంది. అక్కడే అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో’లో నటిస్తోంది. దాంతోపాటు ‘బేవాచ్’ అనే హాలీవుడ్ మూవీలోనూ కనిపించింది. వీటికి ఆమెకు భారీగానే రెమ్యూనరేషన్ అందుతోంది. ఇక అంతర్జాతీయంగా ప్రముఖ బ్రాండ్ ప్రకటనలు - వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రియాంక భారీగా పారితోషికాలు అందుకుంటున్నట్టు సమాచారం.

ఇలా ఒక్క ఏడాదిలోనే రూ60 కోట్లు వరకూ ప్రియాంక సంపాదించినట్టు టాక్. అందుకే ఏడాదంతా బాలీవుడ్ సినిమా చేస్తే వచ్చే 10 కోట్ల కంటే... రూ60 కోట్లు చాలా ఎక్కువ కావడంతోనే సల్మాన్ లాంటి స్టార్ హీరో సినిమాను కూడా ప్రియాంక వదులుకుంటోంది. హాలీవుడ్లో  అవకాశాలను చేసుకుంటూ వెళుతోంది.. పైగా బాలీవుడ్ లో కంటే హాలీవుడ్ లో నటిస్తే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కూడా దక్కుతుంది కాబట్టి ప్రియాంక ఇలా హిందీ జనాలకు దూరమైనట్టు వార్తలొస్తున్నాయి.