'లైగర్' డిలే..అసలు సంగతి ఇదీ!

Tue Aug 16 2022 12:36:18 GMT+0530 (IST)

Reason Behind Liger Film Delay

విజయ్ దేవరకొండ కథానాయాకుడిగా  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైగర్' భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్ లో తొలి పాన్ ఇండియన్ సినిమా ఇది. ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో హిందీ బెల్ట్ టార్గెట్ గా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.ఉత్తరాన  మెయిన్ సిటీని విడిచిపెట్టకుకుండా ప్రమోట్ చేస్తున్నారు. ప్రతీ సిటీలోనూ 'లైగర్' స్టాంప్ పడేలా సిద్దం చేస్తున్నారు. లైగర్ దెబ్బకి రీసౌండ్ ఉదరాతా? అనిపించాలని పూరి కసి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ఔట్ ఫుట్ పై తన కాన్పిడెన్స్ ని వ్యక్తం చేసాడు. గట్టిగానే కొడతాం?  చూస్తూ ఉండండని సంకేతాలు పంపేసారు. అయితే ఓ సినిమా ఇంత ఆలస్యంగా రిలీజ్ అవ్వడం అన్నది పూరి కెరీర్ లోనే ఇదే తొలిసారి కావొచ్చు.

సాధారణంగా పూరి ఆరు నెలల్లో సినిమా చుట్టేసి రిలీజ్ చేసే సత్తా ఉన్న దర్శకుడు.  కానీ అంతటి సమర్ధుడికి 'లైగర్' ని పూర్తిచేయడానికి చాలా సమయం పట్టింది.  అటుపై పోస్ట్   ప్రొడక్షన్ పనులు ఆలస్యం. మధ్యలో కోవిడ్ కూడా కొంత డిస్టబెన్స్ క్రియేట్ చేసింది. ప్రధానంగా  ఈ సమస్యతోనే రిలీజ్ ఆలస్యమైందని అంతా భావిస్తున్నారు.

కానీ  అసలు కారణాలు ఇవన్నీ కాదని  విజయ్ మాటల్లో తెలుస్తోంది. సినిమా చేయాలనుకున్నప్పుడు విజయ్ పాత్ర గురించి చెప్పినప్పడు ఆ పాత్రకి తగ్గట్టు మౌల్డ్  చేసుకోవడానికి రెండు నెలలు సమయం అడిగాడుట. దానికి  తగట్టుగానే  పూరి ఆ సమయం ఇచ్చారుట. కానీ రెండు నెలలు ఎంత కష్టపడినా విజయ్ బాడీ లుక్లో ఏమార్పు రాలేదుట.

దీంతో ఇంకా టైమ్ కావాలని రిక్వెస్ట్ చేసారుట.  పూరి కూడా అలాగే కేటాయించారు. ఈ మధ్యలో విజయ్ పై  బాడీ కనిపించకుండా ఉండే సీన్లు  చిత్రీకరించారు. ఈ సమయంలోనే  కోవిడ్ కూ వచ్చిందిట. దీంతో మరింత  సమయం దొరకడంతో పాత్రకి తగ్గట్టు వీడీ లుక్ లో మార్పులు తీసుకొచ్చినట్లు రివీల్ చేసారు.

అయితే  పూరి మాత్రం కొద్దిపాటి మార్పులతోనే చేసేయాలని భావించారుట. కానీ లుక్ పరంగా పర్పెక్షన్ ఉండాలంటే?  పాత్ర పండాలంటే మరింత ఫిట్ గా బాడీ సిద్దం చేయాల్సి రావడంతో?  ఇంకా ఎక్కువ సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ ఉన్నా సరే అతికొద్ది మందితో షూట చేద్దామనుకున్నారుట. కానీ విజయ్ రెడీగా లేకపోవడంతో షూట్ డిలే అయినట్లు  తెలుస్తోంది. ప్రధానంగా లుక్ కోసం తగినట్లు బాడీ ని సిద్దం చేయడం కోసం ఎక్కువ సమయం కేటాయించారు. ఆ కారణంగానే సినిమా రిలీజ్ కి ఇంత సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది.