Begin typing your search above and press return to search.

50ఏళ్ల త‌ర్వాత‌ బ్రూస్ లీ మ‌ర‌ణం వెన‌క‌ భ‌యాన‌క నిజాలు?

By:  Tupaki Desk   |   25 Nov 2022 5:30 AM GMT
50ఏళ్ల త‌ర్వాత‌ బ్రూస్ లీ మ‌ర‌ణం వెన‌క‌ భ‌యాన‌క నిజాలు?
X
మార్షల్ ఆర్ట్ లెజెండ్ ..హాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ బ్రూస్ లీ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. హాంకాంగ్ ప‌రిశ్ర‌మ‌లో సుప్ర‌సిద్ధ మార్ష‌ల్ ఆర్ట్స్ క‌ళాకారుడు. న‌టుడిగా ఒక సంచ‌ల‌నం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత‌డికి వీరాభిమానులున్నారు. అయితే 1973 వేసవిలో 32 ఏళ్ల వయస్సులో అత‌డు ఆక‌స్మికంగా మరణించాడు. అత‌డి ప్ర‌త్య‌ర్థులు విషం ఇచ్చి చంపేసార‌ని అప్ప‌ట్లో క‌థ‌నాలొచ్చాయి. అయితే ఈ మ‌ర‌ణం అనంత‌రం దాదాపు 50 సంవత్సరాల తర్వాత వైద్యులు దీనిపై విచార‌ణ‌ దావా వేస్తుండ‌డం సంచ‌ల‌నంగా మారింది.

నాటి శవపరీక్ష నివేదికలో బ్రూస్ లీ మెదడు వాపు వ్యాధితో మరణించినట్లు క‌థ‌నాలొచ్చాయి. నొప్పి నివారణ మందులు తీసుకోవడం వల్ల ఈ మ‌ర‌ణం సంభ‌వించింద‌ని వైద్యులు తెలిపారు. పరిశోధకులు ఇప్పుడు మరోసారి నాటి సాక్ష్యాలను సమీక్షించారు. బ్రూస్ లీ వైద్యులు చెప్పిన కార‌ణంతో కాకుండా వేరొక కార‌ణంతో మ‌ర‌ణించార‌ని చెబుతున్నారు. హైపోనాట్రేమియా అనే అరుదైన స‌మ‌స్య‌తో అత‌డు మరణించే అవకాశం ఉందని నిర్ధారించారు.

నిపుణుల బృందంతో కూడుకున్న ప్ర‌ఖ్యాత‌ క్లినికల్ కిడ్నీ జర్నల్ లో ఒక వ్యాసం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ''మరో మాటలో చెప్పాలంటే బ్రూస్ లీ శ‌రీరం నుంచి అదనపు నీటిని విసర్జించడంలో కిడ్నీ ఫెయిలైంద‌ని ఈ కార‌ణ‌మే బ్రూస్ లీని చంపిందని ప్రతిపాదించారు. బ్రూస్ లీకి మూత్రపిండాలు పనిచేయకపోవడం వల్ల మరణించాడని మేము ఊహిస్తున్నామని క‌థ‌నంలో రాసారు. శ‌రీరంలో నీటి హోమియోస్టాసిస్ ను నిర్వహించడానికి తగినంత నీటిని విసర్జించలేకపోవడం ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఇది ప్రధానంగా ఆ గొట్టపు పనితీరు స‌రిగా లేనందున జ‌రిగింది'' అని వెల్ల‌డించారు.

''ఇది హైపోనాట్రేమియా.. సెరిబ్రల్ ఎడెమా (మెదడు వాపు) కు కార‌ణ‌మైంది. మూత్రంలో నీటిని విసర్జించడంతో సరిపోలకపోతే గంటల్లో మరణానికి దారితీయవచ్చు. ఇది లీ మరణించిన కాలక్రమానికి అనుగుణంగా ఉంది'' అని వైద్య నిపుణుల బృందం ఇప్పుడు ధృవీక‌రించింది.

''నా మిత్రమా నీటిలా ప్ర‌వ‌హించు.. నీరులా ఉండు!'' అని బ్రూస్ లీ ఎప్పుడూ త‌న సహ‌చ‌రుల‌కు చెబుతుండేవాడు.. కానీ అదే అదనపు నీరు అతనిని చంపినట్లు కనిపిస్తుంది... అని వారిలో ఒక‌రు వ్యాఖ్యానించారు.

బ్రూస్ లీలో హైపోనాట్రేమియాకు అనేక ప్రమాద కారకాలు ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. ఇందులో అధిక పరిమాణంలో ద్రవం తాగడం .. గంజాయిని ఉపయోగించడం వంటివి దాహాన్ని మ‌రింత‌గా పెంచుతాయి. హైపోనట్రేమియా అనేది రక్తంలో సోడియం స్థాయి... ఇది ద్రవ సమతుల్యతకు అవసరమైనది.. అసాధారణంగా ఇది తక్కువగా ఉంటుంది. అసమతుల్యత మెదడులోని కణాలు సహా శరీరంలోని కణాలు ఉబ్బడానికి కారణమవుతుంది.. అని విశ్లేషించారు.

వాస్త‌వానికి బ్రూస్ లీ మరణం వెన‌క కుట్ర దాగి ఉంద‌ని దశాబ్దాలుగా ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు. అత‌డికి విషం ఇచ్చి ప్ర‌త్య‌ర్థులు చంపేసార‌న్న వాద‌న‌లు ఉన్నాయి. ర‌క‌ర‌కాల‌ సిద్ధాంతాలు ప్ర‌చారంలో ఉన్నాయి. ఇందులో అతను చైనీస్ గ్యాంగ్ స్టర్ లచే హత్యకు గుర‌య్యాడ‌ని కూడా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అసూయపడే స‌న్నిహితుడే అత‌డు తాగే నీటిని విషపూరితం చేసి చంపేసాడు అని క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

అప్ప‌ట్లో బ్రూస్ లీ భార్య లిండా లీ (ఇప్పుడు త‌న వ‌య‌సు 77) కుంగ్-ఫు నిపుణుడైన లీ తన మరణానికి ముందు క్యారెట్ - యాపిల్ జ్యూస్ వంటి ద్రవ-ఆధారిత ఆహారం స్వీక‌రించాడని వెల్లడించారు. 2018 జీవిత చరిత్ర ''బ్రూస్ లీ.. ఎ లైఫ్'' పుస్త‌కాన్ని రాసిన మాథ్యూ పాలీ ఈ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. బ్రూస్ మరణించిన సాయంత్రం పదే పదే నీరు తీసుకోవడం గురించి అత‌డు ప్రస్తావించారు. బ్రూస్ తరచుగా గంజాయిని ఉపయోగించినట్లు ఇందులో రాసారు. ఒక లేఖలో తనను తాను ''నరకంలో రాళ్ళతో కొట్టినట్లు'' ఉంద‌ని బ్రూస్ లీ బాధ‌ప‌డ్డార‌ని అత‌డు పుస్త‌కంలో వివరించాడు.

మే 1973లో ఒక‌రోజు బ్రూస్ లీ అక‌స్మాత్తుగా ఉన్న‌చోటే కుప్పకూలిపోయాడు. వెంట‌నే ఒక వైద్యుడు అతనికి సెరిబ్రల్ ఎడెమాతో బాధపడుతున్నాడని నిర్ధారించిన తర్వాత ఈ సంఘటనకు ముందు అతను నేపాల్ హాష్ (మ‌త్తు పదార్థం) తిన్నాన‌ని అంగీకరించాడు.

బ్రూస్ లీ కెరీర్ ప‌రిశీలిస్తే.. మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలోని 'ఎంట‌ర్ ది డ్రాగ‌న్' ఒక సంచ‌ల‌నం. గేమ్ ఆఫ్ డెత్- సర్కిల్ ఆఫ్ ఐరన్- ది వే ఆఫ్ ది డ్రాగన్- సిటీ హంటర్- ది బర్త్ ఆఫ్ మ్యాన్ కైండ్- ఎ మిరియడ్ హోమ్స్- హియర్ కమ్ ది బ్రైడ్స్- ది పియర్ బెర్టన్ షో ఎంతో పెద్ద విజ‌యం సాధించాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.