Begin typing your search above and press return to search.

ఆహా టెక్నిక‌ల్ గాను ఫెయిలైందా?

By:  Tupaki Desk   |   3 April 2020 2:30 AM GMT
ఆహా టెక్నిక‌ల్ గాను ఫెయిలైందా?
X
దేశంలో లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో సినీ ప్రియులంతా నెట్ ప్లిక్స్..ఆమెజాన్ లాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్ ల‌పై ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. కొత్త కొత్త ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తూ వ్యూయ‌ర్ షిప్ ని పెంచుకునే ప్ర‌య‌త్నాల్లో స్ట్రీమింగ్ సంస్థ‌ల‌న్నీ నిమ‌గ్న‌మ‌య్యాయి. ఇప్ప‌టికే డిజిట‌ల్ స్ట్రీమింగ్ లో అగ్ర‌గామి సంస్థ‌ల‌గా నెట్ ప్లిక్స్..ఆమెజాన్ దూసుకుపోతున్నాయి. దానికి పోటీ కాక‌పోయినా.. తెలుగులో ఏర్పాటైన ఆహా ని ఆ దిశ‌గా ప‌రుగులు పెట్టించాల‌ని బ‌డా ప్లానింగ్ తోనే లాంచ్ చేసారు. కానీ అనుకున్న‌దొక్క‌టి అయిన‌దొక్క‌టి! ఇప్ప‌టికే ఆహా న‌ష్టాల్లో ఉన్న‌ట్లు ట్రేడ్ లెక్క‌లు చెబుతున్నాయి. తెలిసో తెలియ‌కో లేక రిస్క్ చేద్దామ‌నో అందులో పెట్టుబ‌డులు పెట్టిన భాగ‌స్వాములు న‌ష్ట‌పోతున్నార‌న్న క‌థ‌నాలు ఇటీవ‌ల వేడెక్కిస్తున్నాయి.

అయితే లాక్ డౌన్ ని ప‌ర్ పెక్ట్ గా వినియోగించుకుంటే ఆ న‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డొచ్చ‌ని ఆహా టీమ్ భావించింది. ఆహా లాంచ్ అవ్వ‌డం.. ఆ వెంట‌నే దేశం లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడం క‌లిసొచ్చే అంశ‌గా భావించారు. తొలి ద‌శ‌లో 1 మిలియ‌న్ డౌన్ లోడ్స్ తో ఆహా ప‌ర్వాలేద‌నిపించింది. అయితే తాజాగా లాక్ డౌన్ నేప‌థ్యంలో ఆహా సెర్చ్ ఇంజిన్ లో లోపాలు త‌లెత్తి చివ‌రికి సేవ‌లు నిలిపివేయాల్సి వ‌చ్చింది. వీక్ష‌కులంతా ఒక్క‌సారిగా `ఆహా`లో తెలుగు సినిమాల కోసం సెర్చ్ చేయ‌డంతో సెర్చ్ ఇంజిన్ లో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. సాధార‌ణ ట్రాఫిక్ ని కూడా త‌ట్టుకోలేని సన్నివేశం ఎదురైంది. దీంతో తాత్కాలికంగా ఆహా సేవ‌ల్ని నిలిపివేసింది.

తిరిగి వీలైనంత త్వ‌ర‌గా సేవ‌ల్ని పున‌రుద్దిస్తామ‌ని యాజ‌మాన్యం వెల్ల‌డించింది. రెగ్యుల‌ర్ క‌స్ట‌మ‌ర్ల‌కు మెయిల్స్.. మెసేజెస్ ద్వారా ఈ విష‌యాన్ని చేరవేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆహాకి ఆరంభంలోనే ఇలా ఎదురు దెబ్బ త‌గ‌ల‌డం పెద్ద మైన‌స్ అనే చెప్పాలి.ఇప్ప‌టికే రొటీన్ కంటెంట్..నాసిర‌కం సేవ‌ల్ని అందిస్తోంద‌ని ఆహా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటుంది. తాజా సన్నివేశంతో పోటీ బ‌రిలో మ‌రింత వెనుక‌బ‌డే అవ‌కాశం ఉంద‌న్న క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. మ‌రి లోపాల్ని స‌రిద్దుకుని పోటీలో నిలుస్తుందా.. లేదా? మావ‌ల్ల కాద‌ని చేతులెత్తేస్తారా? అంటూ చ‌ర్చ సాగుతోంది.