Begin typing your search above and press return to search.

కుర్ర హీరో స‌క్సెస్ వెన‌క‌ గుట్టు లీక్

By:  Tupaki Desk   |   2 April 2020 4:00 PM GMT
కుర్ర హీరో స‌క్సెస్ వెన‌క‌ గుట్టు లీక్
X
హీరో కం డైరెక్ట‌ర్ అడ‌వి శేష్‌ ప్ర‌తిభ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్వ‌యంకృషి ప్రతిభ‌తో టాలీవుడ్ లో ఎదిగిన హీరోల్లో అత‌నొక‌డు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ ఎంచుకుని సినిమాలు చేయ‌డం శేషులో ప్ర‌త్యేక క్వాలిటీ. అదే శేష్ కి ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌త్యేక‌ గుర్తింపును తెచ్చిపెట్టింది. న‌టుడిగా.. క్రియేటివ్ రైట‌ర్ గా...డైరెక్ట‌ర్ గా యూనిక్ థాట్స్ తో ప‌రిమిత బ‌డ్జెట్ లో సినిమాలు చేసి స‌క్సెస్ అందుకోవ‌డం త‌న స్టైల్ అని నిరూపించాడు. స్క్రిప్ట్ రాయ‌డంలోనూ ఫ్యాష‌నేట్‌ ప‌ర్స‌న్. ఆ ఫ్యాష‌నే ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి స‌పోర్ట్ లేక‌పోయినా ఆల‌స్యంగానైనా గుర్తింపు తెచ్చి పెట్టింది. గూడఛారి..ఎవ‌రు? చిత్రాల‌ తో స‌క్సెస్ అందుకుని టాలీవుడ్ లో బాగా ఫోక‌స్ అయ్యాడు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా రేంజులో మేజ‌ర్ అనే సినిమా లో న‌టించ‌డానికి రెడీ అవుతున్నాడు.

2008 ముంబై దాడుల్లో అమ‌రుడైన మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ బ‌యోపిక్ లో శేష్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు.. హిందీ భాష‌ల్లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ నిర్మిస్తున్నారు. ఎంబీ బ్యాన‌ర్ లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తో శేషు త‌న ఇమేజ్ ని పాన్ ఇండియా స్థాయికి చేర్చాలనే పంతం తో ఉన్నాడు. ఇప్ప‌టికే సినిమా సెట్స్ కు వెళ్లాల్సి ఉన్నా.. అనూహ్యంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించ‌డంతో వాయిదా ప‌డింది. ప్ర‌స్తుత లాక్ డౌన్ నేప‌థ్యంలో సెల‌బ్రిటీలంతా ఇళ్ల‌లోనే కాల‌క్షేపం చేస్తున్నారు. ఫ్యామిలీ తో ఎక్కువ స‌మాయాన్ని గుడ‌పుతున్నారు.

అయితే శేషు మాత్రం విరామం తీసుకోవ‌డం లేదు. ఖాళీ స‌మ‌యాన్ని కూడా సినిమాల‌కే కేటాయించాడు. ర‌క‌ర‌కాల స్క్రిప్టుల‌పై వ‌ర్క్ చేస్తూ..క్లాసిక్ చిత్రాల‌ను స్ట‌డీ చేసే ప‌ని పెట్టుకున్నాడు. అటు మేజ‌ర్ పాత్ర‌కు సంబంధించిన ప‌నులు చూసుకుంటూనే మిగ‌తా సమ‌యాన్ని న‌టుడిగా ఆరితేరేందుకు శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. అందుకోసం శేష్ ఓల్డ్ క్లాసిక్స్ ని చూస్తున్నాడ‌ట‌. ఇందులో గాడ్ ఫాద‌ర్ స‌హా ద‌ళ‌ప‌తి.. రోజా లాంటి సినిమాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. వీటిలో క్యారెక్ట‌ర్ ఇంటెన్సిటీపై స్ట‌డీ చేస్తున్నాడ‌ట‌. హీరోల్లో ఇలాంటి క్వాలిటీస్ చాలా త‌క్కువ‌మందికే ఉంటాయి. సినిమానే శ్వాసిస్తే ఇక్క‌డ రాణించ‌గ‌లం అన్న విష‌యాన్ని శేషు ప్రూవ్ చేస్తున్నాడు. అందుకోసం ప‌క‌డ్భంధీ ప్లాన్ తో ముందుకెళుతున్నాడు. స్క్రిప్టు రాసేందుకైనా.. న‌టుడిగా ఎదిగేందుకైనా స్ట‌డీ చాలా ఇంపార్టెంట్. ప్ర‌స్తుతం ఆ ప‌నిలోనే త‌ల‌మున‌క‌లుగా ఉన్నాడ‌న్న‌మాట‌.