Begin typing your search above and press return to search.

విల‌న్ గా నాగ‌చైత‌న్య ప్ర‌యోగానికి రెడీ

By:  Tupaki Desk   |   22 Sep 2021 5:10 AM GMT
విల‌న్ గా నాగ‌చైత‌న్య ప్ర‌యోగానికి రెడీ
X
నాగ చైతన్య విల‌న్ గా న‌టిస్తున్నారా? అంటే అవున‌నే క‌న్ఫామ్ చేశారు. రొటీన్ గా సంప్రదాయ పాత్రలలో క‌నిపించే చైతూ త‌న‌కు తానుగానే ఆ త‌ర‌హా స్క్రిప్టును ఎంపిక చేసుకున్నాన‌ని ఇక‌పై ఇలాంటి ప్ర‌యోగాలు నా నుంచి చూస్తార‌ని ప్ర‌తిన‌బూనాడు చై.

రెగ్యుల‌ర్ గా ప‌ద్ధ‌తైన యువ‌కుడ‌గా ఎక్కువగా కనిపించే నాగ చైతన్య ఇప్పుడు ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు చైతన్య తన తొలి వెబ్ సిరీస్ లో విల‌న్ గా న‌టిస్తాన‌ని తెలిపారు. దీనికి విక్రమ్.కె కుమార్ దర్శకుడు. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తాను విలన్ గా నటిస్తున్నట్లు చైతన్య స్వయంగా ధృవీకరించారు. విక్రమ్ స్క్రిప్ట్ విన్న తర్వాత నేను చాలా థ్రిల్ అయ్యాను. ఇలాంటి కథ థియేట్రికల్ ఆడియన్స్ కి సరిపోదని నేను భావించాను. నేను ఈ సిరీస్ లో విల‌న్ గా నటిస్తున్నాను``అని చెప్పాడు. ఇకపై మరిన్ని OTT సిరీస్ ల‌లో న‌టిస్తాన‌ని చైతన్య ప్రతిజ్ఞ చేశాడు. నేను థియేట్రికల్ చిత్రాలలో తప్పనిసరిగా పోషించలేని పాత్రలను పోషించడానికి OTT ని ఉపయోగిస్తాను.. నటుడిగా త‌న‌కు తానే సవాళ్లు స్వీక‌రిస్తాన‌ని చైతన్య నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అభిమానుల కోసం చేయ‌ను

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన లవ్ స్టోరీ ఈ నెల 24 న విడుదల కానుంది. తాజా ఇంటర్వ్యూలో నాగ‌చైత‌న్య మాట్లాడుతూ... అభిమానుల కోసం తాను సినిమాలు చేయనని చెప్పాడు. ట్రెండ్ ను సృష్టించే ప్రేక్షకుల కోసం ఫ్రెష్ గా ఏదైనా అందించే సినిమాలు చేయాలనుకుంటున్నట్లు చైత‌న్య చెప్పాడు. నేను విభిన్నమైన సినిమాలు మాత్రమే చేస్తే అభిమానుల సంఖ్య ఆటోమెటిగ్గా పెరుగుతుందని దీనికి విరుద్ధంగా ఉండ‌న‌ని చెప్పారు. అతని తండ్రి నాగార్జున .. తాత అక్కినేని నాగేశ్వరరావుల విషయంలో అదే జరిగిందని అన్నారు.